Telugu News

కార్యకర్తలే బీఆర్ఎస్ బలమైన పునాది:నామా 

ఎన్నికల క్షేత్రంలో ప్రధాన భూమిక వహించాలి:నామా 

0

ఎన్నికల క్షేత్రంలో ప్రధాన భూమిక వహించాలి:నామా 

== కార్యకర్తలే బీఆర్ఎస్ బలమైన పునాది

== అభివృద్ధి ని ప్రజల్లోకి తీసికెళ్లాలి

== మాయ, మోసపు మాటలు చెప్పే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి

== తెలంగాణా పై కేంద్రం క్షక్ష

== విభజన హామీలు విస్మరించారు

== కేసీఆర్ కు రాబోయే కాలంలో అండగా ఉండాలి

== ఆత్మీయ సమావేశాల్లో వెల్లివిరిసిన ఉత్సాహాం

== ఆత్మీయ సమావేశాల్లో బీఆరఎస్  లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు  ప్రసంగం

ఖమ్మం, ఏప్రిల్ 2(విజయంన్యూస్):

 ప్రతి బీఆర్ఎస్  కార్యకర్త తెలంగాణా ఉద్యమ స్పూర్తితో రానున్న ఎన్నికల క్షేత్రంలో క్రియాశీలక భూమిక నిర్వర్తించాలని బీఆర్ ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎంపీ నామ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుడిగాలిలా పర్యటించారు. ఈ సందర్భంగా వైరా, చండ్రుగొండ, ఎర్రుపాలెం లలో జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని, కేసీఆర్ ఆదేశాల మేరకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. 8 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనూహ్యమైన అద్భుత అభివృద్ధి జరిగిందని, ప్రతి కుటుంబం,  వ్యక్తి ఏదో రూపంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందడం జరిగిందన్నారు.సంక్షేమం, అభివృద్ధి ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, చైతన్యం చేయాలన్నారు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని, ఇంటింటికి వెళ్లి, కుటుంబాలతో మమేకమై కేసీఆర్ కు మరింత అండగా ఉండాలన్నారు. మాయ, మోసపు మాటలు చెప్పే వారి గురించి ,మరింత అప్రమత్తమై ఎదుర్కోవాలన్నారు.

==వైరా లో                                  ఇదికూడా చదవండి: ‘పాలేరు’లో ముదురుతున్న దోస్తుల లొల్లి

కేంద్ర ప్రభుత్వం తెలంగాణా పై కక్ష గట్టి తెలంగాణా ప్రజల్ని చిన్న చూపు చూస్తోందని వైరాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో కేంద్రంపై నామ నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలసి పాల్గొన్న ఈ సమావేశానికి హాజరైన నామ మాట్లాడారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు రాకుండా కేంద్రం కావాలనే తెలంగాణా  అభివృద్ధిని అడ్డుకుంటుందని దుయ్య బట్టారు.రాష్ట్రానికి చెందిన బీజేపీ కేంద్ర మంత్రి, ఎంపీ రాష్ట్రానికి ఏమి చేయకుండా, రాష్ట్రం గురించి పార్లమెంటులో ఏమీ మాట్లాడకుండా ఇక్కడకొచ్చి మాయ, మోసపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అటువంటి వారి మాయ మాటలను నమ్మి మోసపోవద్దని అన్నారు. కేసీఆర్ వల్ల పంచాయతీ నుంచి పార్లమెంట్ దాక 90 శాతం పదవులు అనుభ విస్తున్నామని అన్నారు.8 ఏళ్లలో దేశంలో ఎక్కడా జరగని సంక్షేమం,  అభివృద్ధి తెలంగాణాలో జరిగిందన్నారు. అన్నింటా నేడు తెలంగాణా నెంబర్ వన్ గా ఉందన్నారు. అందుకే దేశ ప్రజలు మన నాయకుడు కేసీఆర్  నాయకత్వాన్ని కోరు కుంటుందని తెలిపారు.వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వ మేనని, అందులో ఎవరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ కు అన్ని విధాలా అండగా ఉండి , మూడోసారి మంచి మెజార్టీతో సీఎం గా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణా రాకముందు తెలంగాణా ఎట్లుంది… ఈ 8  ఏళ్లలో ఎంత అభివృద్ధి సాధించిందో మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా  కనిపిస్తుందని అన్నారు. తెలంగాణ రాకముందు తాగు, సాగు నీరు, కరెంట్, అభివృద్ధి లేక అల్లాడిపోయిన తెలంగాణా ను కేసీఆర్ దేశంలోనే టాప్ గా ఉంచారని అన్నారు.అందుకే నేడు ప్రతి గుమ్మానికి ,ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుందని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ప్రభుత్వ పధకాలను ఇంటింటి కెళ్లి ప్రచారం చేయాలని నామ నాగేశ్వరరావుపిలుపునిచ్చారు.

== ఎర్రుపాలెం లో

ఎర్రుపాలెం లో జరిగిన పార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ …అన్నదమ్ముల్లా అందరం ఎన్నికల కోసం కలిసి పని చేద్దాం…. మీ వెనుక మేమంతా ఉన్నాం… మనందరి వెనుక మన బ్రహ్మాండ నాయకుడు కేసీఆర్ ఉన్నారు.. అన్నింటా బీఆర్ఎస్ దే విజయమని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: పొంగులేటి ఖబర్దార్!

అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశానికే దిక్చుచిగా మారిందన్నారు.రైతన్నల కోసం కేసీఆర్ అన్నింటా అగ్రస్థానం ఇచ్చారన్నారు. రైతు బంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పధకాలు దేశంలోనే అద్భుతాలన్నారు. ఒక్క రైతు బంధు ద్వారా రాష్ట్రంలో 65 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలో 50 వేల కోట్లకు పైగా అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో సీతారామ ప్రాజెక్టు పూర్తి ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం సస్యశ్యామలం అవుతుందని నామ పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ లో భూగర్భ జలాలు  పైనే ఉండటం రైతుల అదృష్టమన్నారు. గతంలో బోర్లు పడక, అప్పులపాలై ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితి ఉండేదని, కానీ నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పుష్కలంగా నీళ్లు, పంటలు అన్నారు. ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తున్న రాష్ట్రమేది అని తాను పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నిస్తే తెలంగాణా అని కేంద్రం సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. మరో వైపు తెలంగాణ పధకాలను కేంద్రం కాపీ కొదుతుందన్నారు. ఇంకో వైపు కక్ష గట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు రాకుండా అడ్డుకుంటున్నదని అన్నారు. వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టాలని చూస్తే కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంట్ లో అడ్డుకోవడంతో వెనక్కి తగ్గిందని నామ అన్నారు.ఈ సమావేశాల్లో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ , అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్ధసారధి రెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు, జెట్పీ చైర్మన్ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు  , జిల్లా ఎం టెలికం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్, ఉప్పునూతల నాగేశ్వరరావు, మోరంపూడి ప్రసాద్, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, కృష్ణ ప్రసాద్, భార్గవ్ తదితరులు తో పాటు వైరా, చండ్రుగొండ, ఎర్రుపాలెం మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

==జమలాపురంలో నామ పూజలు

ఈ సందర్భంగా జమలాపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో  ఎంపీ నామ నాగేశ్వరరావు, బండి పార్థసారధి రెడ్డి, తాతా మధు, లింగాల కమలరాజు, కొండబాల ,నల్లమల తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడాచదవండి: లోక్ సభలో మహిళా బిల్లుపై చర్చకు నామ  గట్టిపట్టు

== ఉప్పొంగిన ఉత్సాహాం

ఆత్మీయ సమావేశాల్లో కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధుల్లో సరికొత్త ఉత్సాహం ఉప్పొంగింది. నూతన చైతన్యం వెల్లివిరిసింది. ప్రతి చోట పెద్ద ఎత్తున సమీకృతమై ఎంపీ నామ నాగేశ్వరరావు కు సాదర ఘన స్వాగతం పలికారు. తమ ప్రాంతానికి వచ్చిన నేత నామ నాగేశ్వరరావు కు ప్రేమ,అభిమానంతో శాలువా లతో సన్మానం చేసి, అభిమానం చాటుకున్నారు. వైరా, చండ్రుగొండ, ఎర్రుపాలెం లో నామ ప్రసంగం ఆద్యంతం కార్యకర్తలను ఆలోచింపజేసింది. సమావేశాల అనంతరం నామ తో సెల్ఫీలు దిగి అభిమానం పంచుకోవడం గమనార్హం.