Telugu News

మిర్చి రైతులను ఆదుకోవాలని ఖమ్మం కలెక్టర్ కు కాంగ్రెస్ వినతి

%% నష్టపరిహారం కిందా రూ.1.50లక్షలు ప్రతి ఎకరానికి ఇవ్వాలి

0

మిర్చి రైతులను ఆదుకోవాలని ఖమ్మం కలెక్టర్ కు కాంగ్రెస్ వినతి
%% నష్టపరిహారం కిందా రూ.1.50లక్షలు ప్రతి ఎకరానికి ఇవ్వాలి
%% జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందించిన కాంగ్రెస్ నాయకులు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్);-
తామర పురుగు కారణంగా రైతులు సాగు చేసిన మిర్చి పంట పూర్తిగా దెబ్బతిన్నదని, చాలా వరకు దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటి ఆద్వర్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యకులు పువాళ్ళ దుర్గా ప్రసాద్, మాజీ శాసన మండలి సభ్యులు పోటనాగేశ్వరరావు, స్థానిక సంస్థల ఎంఎల్సీ అభ్యర్థి రాయలనాగేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు రైతుల సమస్యలను విన్నవించారు. రైతులు ఏ విధంగా నష్టపోయారు, ఎకరానికి ఎంత వరకు నష్టపోయారో వివరించారు.

also read :-వైరాలో 14కిలోల గంజాయి పట్టివేత

ప్రభుత్వానికి మీ ద్వారా సిపారసు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పువ్వాళ్ల దుర్గప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం మధిర, వైరా నియోజకవర్గాల్లో సీఎల్పీనేత భట్టి విక్రమార్క ఆద్వర్యంలో మిర్చి పంటలను పరిశీలించడం జరిగిందని, ఆ పంటలు సాగు చేసిన రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతులు ఈ ఏడాది ఎక్కువగా మిర్చితోటలను సాగు చేశారని, అధిక వర్షాల కారణంగా మిర్చి పంటకు తామర పురుగు వైరస్ సోకి మొత్తం పంట ఎర్రబారిపోయి, వాడిపోయి చచ్చిపోయే దశలో ఉన్నాయని అన్నారు.

also read:-ఘటనా స్థలాన్ని పరిశీలించిన వైరా సిఐ వసంత్ కుమార్..

ఆ పంటను రక్షించుకునేందుకు రైతులు అప్పులు చేసి మరి పురుగుమందులను పిచికారి చేస్తున్నారని, తద్వారా రైతులకు ఈ ఏడాది భారీగా సాగు భారం పడిందన్నారు. అంతేకాకుండా మిర్చి పూర్తిగా దిగుబడి తగ్గిందని, ఎకరానికి 5క్వింటాల మిర్చి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ సందర్భంలో రైతన్న దీనాస్థితిలో ఉన్నారని, అందుకే రైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ప్రతి ఎకర మిర్చి తోటకు రూ.1.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని, లేకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉండోచ్చని అన్నారు.
అదేవిధింగా ధాన్యం కొనుగోలు మందగించినదని, త్వరితగతిన రైతుల ధాన్యాన్ని సేకరించి రైతులను తగు విధంగా ఆదుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లాకిసాన్ కాంగ్రెస్ మొక్కా శేఖర్ గౌడ్, అంజనిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.