Telugu News

*మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ కు లేదా : తమ్మినేని

*పరిహారం పై ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించాలి

0

*మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ కు లేదా : తమ్మినేని
*పరిహారం పై ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించాలి
*రైతు ఆత్మహత్య లను నివారించాలి
-సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ పార్లమెంటు సభ్యుడు మిడియం బాబురావు
== కొణిజర్లలో మిర్చితోటలను పరిశీలించిన సీపీఎం రాష్ట్ర కమిటీ
(కొణిజర్ల, ఖమ్మం-విజయంన్యూస్);-
తెలంగాణ రాష్ట్రం లో మిర్చి పంట వైరస్ తో పాటు గులాబీ,తామర పురగులతో దెబ్బ తిన్ని ఎకరాకు లక్ష రూపాయలు పైగా పెట్టుబడి ఖర్చు పెట్టి పంటలు తొలిగించి పరిస్థితి లో రైతులు ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే స్పందించి మిర్చి రైతులు ఆత్మహత్యలను నివారించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, భద్రాచలం మాజీ పార్లమెంటు సభ్యులు మిడియం బాబురావు డిమాండ్ చేశారు,

ఆదివారం కొణిజర్ల మండలం లక్ష్మీపురం, పెద్ద రాంపురం లో వైరస్,తామర, పురగులతో నష్టపోయిన మిర్చి పంట ను సిపిఎం రాష్ట్ర బృందం పరిశీలించింది ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం బాబురావు మాట్లాడుతూ, మిర్చి రైతులు కు అవసరమైన సలహాలు సూచనలు అందించడం లో రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానవన శాఖ పూర్తిగా వైఫల్యం చెందాయని, సకాలంలో రైతులకు సలహాలు అందించి ఉంటే నష్టం తక్కువ గా ఉండేది అని అన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు జరిగిన నష్టం పకృతి వైపరిత్యాలు క్రింద పరిగణనలోకి తీసుకుని ప్రకృతి విపత్తు గా ప్రకటించి ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు, కౌలు రైతులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది అని కౌలు రైతు లకు అదనంగా కౌలు కూడా చెల్లించాలి అని డిమాండ్ చేశారు,

ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయని రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు అని మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు రైతులు జరుపుతున్న ఉద్యమం కు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇస్తుంది అని, రాష్ట్ర వ్యాప్త ఉద్యమం గా సిపిఎం మిర్చి రైతులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళ పల్లి కృష్ణ, మండల కార్యదర్శి చెరుకు మల్లి కుటుంబరావు, మండల నాయకులు దొడ్డపనేని కృష్ణార్జున్ రావు, చింతపల్లి ప్రసాద్, హరిచంద్, జట్ల రవి, మిద్దె రామారావు, గాదె వెంకటరెడ్డి, దుగ్గినేని అజయ్, నంద్యా,యాలాద్రి రైతులు పాల్గొన్నారు

ALSO READ :-వేటు పడేనా..!? వైదొలిగేనా…?! – మాజీ ఎంపీ పయనమెటు…?