Telugu News

నేడు వామన అవతారంలో దర్శనమిస్తున్న

భద్రాద్రి రామయ్య..........

0

నేడు వామన అవతారంలో దర్శనమిస్తున్న
భద్రాద్రి రామయ్య……….
(భద్రాచలం/ చండ్రుగొండ- విజయం న్యూస్ )
భద్రాచలం :భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఐదవ,రోజైన
శుక్రవారం స్వామి వారు వామన అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ నిబంధనల నడుమ ఉత్సవాలు ఆలయం లోపలే నిర్వహిస్తున్నారు. వామన అవతారం లో ఉన్న స్వామి వారికి ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కోవిడ్ నిబంధనల దృష్ట్యా రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలని
దేవస్థానం ఈవో శివాజి సూచించారు. ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి ముక్కోటి ఉత్సవాల వేళ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.