నేడు ఇల్లందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర
== 9న లచ్చాతండాలో రాత్రి నైట్ హాల్ట్
== 10న ఇల్లందు నియోజకవర్గంలో పర్యటన
== భారీగా హాజరుకానున్న కాంగ్రెస్ శ్రేణులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన చేపట్టిన ‘హత్ సే హత్ జోడో అభియాన్’ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఇల్లెందు నియోజకవర్గంలో పర్యటించనున్న ఆయన ఆ తరువాత డోర్నకల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందుకు గాను భద్రాద్రికొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ భారీగా ఏర్పాట్లు చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర జమ్ముకాశ్మీర్ లో ముగిసిన అనంతరం హత్ సే హత్ జోడో అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్రలను నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించింది.
ఇదికూడా చదవండి: రా..రామన్ని.రారా..రమ్మని
ప్రజల్లోకి వెళ్తూ, ప్రజల సమస్యలపై ద్రుష్టిసారించి, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడమే లక్ష్యంగా, ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై ఉద్యమం చేయాలనే ఆలోచనతో దేశవ్యాప్తంగా యాత్ర కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే భారతదేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు హత్ సే హత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా హత్ సే హత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకు గాను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈనెల 6 నుంచి ములుగు జిల్లాలో పాదయాత్ర చేపట్టిన రేవంత్ రెడ్డి మహుబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. సుమారు 20 రోజుల పాటు మహుబూబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది.
== నేడు ఇల్లెందు నియోజకవర్గానికి రానున్న రేవంత్ రెడ్డి
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లాలో చేపట్టిన పాదయాత్ర మూడు రోజుల అనంతరం శుక్రవారం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనుంది. డోర్నకల్ నియోజకవర్గంలో పాదయాత్రను పూర్తి చేసుకుని ఇల్లందు నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. ఇల్లెందు నియోజకవర్గం లచ్యాతండా వద్ద నియోజకవర్గంలోకి పాదయాత్ర రానుంది. దీంతో లచ్యతండాలో బస చేయనున్న రేవంత్ రెడ్డి, తిరిగి ఈనెల 10న కామేపల్లి మండలంలోని లచ్యతండా, బర్లగూడెం,పోన్నెకల్లు గ్రామంలో పాదయాత్ర చేయనున్నారు.
ఇదికూడా చదవండి: స్వంత గూటికా..?సోదరి గూటికా..? పొంగులేటి దారేటు..?
అనంతరం బండిపాడు క్రాస్ రోడ్డు వద్ద మధ్యాహ్న భోజన విరామం ప్రకటించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి ప్రారంభమై గోవిందరాల,పాతలింగాల, కొత్త లింగాల వద్ద ఏర్పాటు చేసిన మీటింగ్ లో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. అక్కడే రాజీవ్ నగర్ లో రాత్రి బస చేయనున్నారు. అక్కడ నుంచి మరసటి రోజు ఈనెల 11న ఇల్లెందు నియోజకవర్గంలోని రాజీవ్ నగర్ లో ప్రజా సంఘాలు,పార్టీ నాయకులు,కార్యకర్తలు తో,రైతులతో ముఖాముఖీ కానున్నారు. సాయంత్రం:- రాజీవ్ నగర్, సడ్ బిడ్ బస్తీ, డీఎస్పీ కోటర్స్, గోవింద్ సెంటర్,కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, జగదాంబసెంటర్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం జేకె.కాలని, కరెంట్ ఆఫిస్ వరకు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు. అక్కడ నుంచి భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
== అడుగడుగున భారీ ఏర్పాట్లు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం చేసే కార్యక్రమాలను ఇప్పటికే చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల నుంచి జనంను భారీగా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే ప్రాంతాల్లో, గ్రామాల్లో భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. అడుగడుగున ప్లెక్సిలు ఏర్పాటు చేస్తున్నారు. తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే గ్రామాల్లో ప్రజలను పెద్ద సంఖ్యలో వచ్చే విధంగా ఇల్లెందు నియోజకవర్గ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు భారీగా జన సమీకరణ చేసేందుకు ఎవరికి వారు ప్రయత్నాల్లో నిమగ్నమైయ్యారు
ఇది కూడా చదవండి: దళిత,గిరిజనులకు అండగా కాంగ్రెస్ జెండా: భట్టి