Telugu News

ఈరోజే “డ్రా..డే”..!

* కొందరి..తలరాతలు మార్చే రోజు..

0

ఈరోజే “డ్రా..డే”..!

* కొందరి..తలరాతలు మార్చే రోజు..

(హైదరాబాద్-విజయం న్యూస్) :-

రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్​ల ఎంపిక ప్రక్రియ ఇవాళ జరగనుంది. ఇందుకు ఎక్సైజ్​ శాఖ సర్వం సిద్దం చేసింది. ఉదయం 11 గంటలకు రాష్ట్రంలోని 34 జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో ఎక్షైజ్ సుపంరిండెంట్ల ద్వారా లాటరీ విధానంలో లైసెన్స్​లను ఎంపిక చేస్తారు.

జిల్లా కలెక్టర్‌ లేదా ఆయన సూచించిన అధికారి ఆధ్వర్యంలోనే లైసెన్సుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. లాటరీ ద్వారా జరగనున్న ఎంపిక ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లను ఎక్సైజ్​ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన చోట… ప్రత్యేకంగా ఫంక్షన్ హాళ్లు తీసుకుని దరఖాస్తు దారులకు అసౌకర్యం కలగకుండా మౌలిక వసతులను అధికారులు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న 2,620 మద్యం దుకాణాల లైసెన్సుల కోసం మొత్తం 67,849 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో దరఖాస్తుకు రెండు లక్షలు రూపాయిలు లెక్కన నాన్‌ రీఫండ్‌బుల్‌ మొత్తం ద్వారా ప్రభుత్వానికి ఏకంగా రూ.1,356.98 కోట్లు ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

also read :- చంద్రబాబు కంటతడి పెట్టడం బాధాకరం: పవన్ కల్యాణ్.

 

please subscribe theis channel :- https://youtu.be/l1Gvf4gr9Kk