Telugu News

నేడే మేడే

కార్మికుల్లో స్పూర్తి నింపిన మేడే

0
నేడే మేడే
== కార్మికుల్లో స్పూర్తి నింపిన మేడే
ఏన్కూరు (విజయం న్యూస్):
ప్రపంచవ్యాప్తంగా నేడే (బుధవారం) అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు జరుపుకోనున్నారు. ఎన్నో ఏళ్ల కార్మికుల ఉద్యమాల ఫలితంగా ప్రతి ఏటా మే 1న కార్మికుల దినోత్సవాన్ని (మేడే) జరుపుకుంటారు. రోజుకు ఎనిమిది గంటల పని వేళల కోసం కార్మికులు అలుపెరగని పోరాటాలు చేశారు. వారి హక్కుల కోసం ఉద్యమించారు.1886లో అమెరికాలోని చికాగోలో కార్మికులు జరిపిన మహా ప్రదర్శన మేడే ఆవిర్భావానికి పునాది వేసింది. అన్ని రంగాల్లోని కార్మికుల్లో మేడే స్ఫూర్తి నింపింది.