Telugu News

నేడు మాజీ మంత్రి ఈటెల జిల్లాలో పర్యటన

నష్టపోయిన పంటలను పరిశీలించనున్న ఈటెల

0

నేడు మాజీ మంత్రి ఈటెల జిల్లాలో పర్యటన

== నష్టపోయిన పంటలను పరిశీలించనున్న ఈటెల

(కూసుమంచి-విజయంన్యూస్)

మాజీ మంత్రి, హుజురాబాద్ శాసనసభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు ఈటెల రాజేందర్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలే అకాల వర్షాల వల్ల పంటలు తీవ్రంగా నష్టం జరిగిందని, ఈ పంటలను పరిశీలించేందుకు, అలాగే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, నెలల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాస్తున్న పట్టించుకోవడం లేదని, ఆ రైతులను పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్,  బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి హాజరువుతున్నారని తెలిపారు. బుధవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుమలాయపాలెం మండలం సబ్లేడు క్రాస్ రోడ్ వద్దకు చేరుకుంటారని, అక్కడ నాయకులు ఘనంగా స్వాగతం పలుకుతారని తెలిపారు. అలాగే 2:30గంటలకు   పాతర్లపాడు ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన, 3:15 బీరోలు ఐకెపి కేంద్రం పరిశీలన, 4 గంటలకు పాలేరు ఐకెపి కేంద్రాన్ని సందర్శిస్తారని తెలిపారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి లక్ష్యం కేసీఆర్ ను దించుడే: ఈటెల