Telugu News

రేపే సచివాలయ ప్రారంభానికి ముహుర్తం 

మధ్యాహ్నం నూతన సచివాలయ ప్రారంభోత్సవం చేయనున్న సీఎం కేసీఆర్

0

రేపే సచివాలయ ప్రారంభానికి ముహుర్తం 

== మధ్యాహ్నం నూతన సచివాలయ ప్రారంభోత్సవం చేయనున్న సీఎం కేసీఆర్

== ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

== ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి వేముల

== 30న ట్రాఫిక్‌ ఆంక్షలు..పార్కుల మూసివేత

(హైదరాబాద్‌ -విజయంన్యూస్):

తెలంగాణ ప్రభుత్వం ఖాతాలో మరో చారితాత్మకం ఘటన చోటు చేసుకునే సమయం అసన్నమైంది.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అన్ని హంగులతో అద్భుతమైన నూతన సచివాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం చేసింది.. ఆ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ పేరును నామకరణం చేశారు. అందుకు చూసనగా 125 అడుగుల విగ్రహాన్ని అవిష్కరించారు. ఈ సచివాలయంను సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలెంజ్ గా తీసుకుని నిర్మాణం చేశారు. భారీ వ్యయంతో అద్భుతమైన కట్టడలాతో ఎవరికి సాధ్యం కాని విధంగా, ఏ ప్రభుత్వం సహాసం చేయని విధంగా నూనత సచివాలయంను నిర్మాణం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: ‘సంక్షేమ భారత్’ మా లక్ష్యం: సీఎం కేసీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంను ఆదివారనాడు కెసిఆర్‌ ప్రారంభించనున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీ ఘటనలు జరక్కుండా పర్యవేక్షిస్తున్నారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేమలు ప్రశాంత రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఆయన పలుమార్లు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే హోంమంత్రి మహ్మూద్‌ అలీకూడా పరిశీలించారు. సామన్య ప్రజలను ఇందుకు అనుమతించడం లేదు. ప్రారంభోత్సవం సందర్భంగా సచివాలయ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం మూసివేస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ హెచ్‌ఎండిఏ ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా సచివాలయం పరిసరాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆదివారం నాడు లుంబిని పార్క్‌, ఎన్టీఆర్‌ గార్డెన్‌, ఎన్టీఆర్‌ ఘాట్‌, లేజర్‌ షోలను మూసి వేస్తున్నట్లు హెచ్‌ఎండిఏ  ప్రకటించింది. సచివాలయాన్ని ఈనెల 30న ప్రారంభించడమే కాకుండా…

ఇది కూడా చదవండి: పార్లమెంటు నూతన భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలి:ఎంపీ రవిచంద్ర

అదేరోజు నుంచే కార్యకలాపాలు ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సచివాలయ భవనంలోని ముఖ్యమంత్రి చాంబర్‌, సంబంధిత కార్యాలయం, పేషీని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సందర్శకుల కోసం ప్రత్యేక హంగులతో కూడిన చాంబర్‌ను కూడా సిద్ధం చేశారు. మంత్రుల చాంబర్‌, దాని పక్కనే సంబంధిత శాఖ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి చెందిన చాంబర్లను ఒకేచోట ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఒక శాఖకు సంబంధించిన వ్యవహారాలన్నీ.. ఒకే చోట ఉంటే.. ఫైళ్ల క్లియరెన్స్‌, అధికారులతో తరచూ సమావేశం కావడం, శాఖకు చెందిన వ్యవహారాలను క్షణాల్లో చక్కదిద్దే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు తెలుస్తోంది. ఆ దిశగానే మంత్రులు, వారికి సంబంధించిన కార్యదర్శులకు చాంబర్లు, గదులను కేటాయించారు. ప్రారంభోత్సవం సందర్బంగా ఆదివారం నగరంలో నూతన సచివాలయం పరిసరాల్లో రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. కాగా.. ఈ ఆంక్షలవల్ల ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను దారిమళ్లించారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్‌ రోడ్డు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అలాగే చింతల్‌బస్తీ నుంచి వచ్చే వాహనాలు నెక్లెస్‌ రోడ్డు వైపు అనుమతి నిరాకరించారు. అలాగే ఇక్బాల్‌ మినార్‌ నుంచి వచ్చే వాహనాలకు తెలుగుతల్లి జంక్షన్‌ వైపు మళ్లించారు. అలాగే.. బీఆర్‌కే భవన్‌ నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇచ్చారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ సచివాలయం ఓ చారిత్రాత్మకం