Telugu News

రేపు కాంగ్రెస్ గూటికి సంభాని..

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్ లో చేరిక

0

రేపు కాంగ్రెస్ గూటికి సంభాని..

== ఏఐసీసీ, పీసీసీ నేతల ఆహ్వానం

== సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీభవన్ లో చేరిక

== అసెంబ్లీ ఎన్నికల ముందు టిక్కెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ లో చేరిన సంభాని 

(ఖమ్మం -విజయం న్యూస్)

మాజీ మంత్రి, సీనియర్ నాయకులు సంభాని చంద్రశేఖర్ స్వంత గూటికి చేరేందుకు రంగం సిద్దమైంది. అసెంబ్లీ ఎన్నికల కోసం సత్తుపల్లి టిక్కెట్ ఆశించిన సంభాని చంద్రశేఖర్ టిక్కెట్ రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేశారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఇద్దరు ఓడిపోవడంతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో ఎన్నికల అనంతరం రాజకీయాలకు, బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఏఐసీసీ,టీపీసీసీ పిలుపు మేరకు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు సిద్ధమయ్యారు. అందుకు గాను రేపు ఉదయం 10 గంటలకు సంభాని చంద్రశేఖర్ గాంధీభవంలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో… కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వుతున్నట్లుగా ఆయన వర్గీయులు సోషల్ మీడియా లో ప్రకటించారు. సంభాని చంద్రశేఖర్  తన 50 సంవత్సరాల రాజకీయ జీవితం లో  కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటుగా, నీతి నిజాయితీగా పనిచేసి, తన శ్రమను పార్టీ కోసం దార పోశారు.అసెంబ్లీ ఎన్నికలలో. ఎప్పుడూ పార్టీ మారని వ్యక్తి క్షణికావేశంలో బిఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని లక్ష్యంతో, ఖమ్మం ఎంపీ గెలుపే లక్ష్యంగా, రేపు తన అనుచర ఘణముతో సొంతగూటికి కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం జరుగుతుందని* తెలియజేస్తున్నారు.మ