ఖమ్మంలో కుండపోత వర్షం
== మార్కెట్లో తడిసిన మిర్చి బస్తాలు
== గగ్గోలు పెట్టిన రైతాంగం
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
వర్ష సూచన లేదు..మబ్బులు పట్టలేదు.. ఒక వైపు ఎండ..మరో వైపు ఉక్కపోత..ఎవరైనా వర్షం వస్తుందని భావిస్తారా..? ఎండోస్తుంది కదా అని రైతులు మిర్చి పంటను, ధాన్యం, మొక్కజొన్నలను అరబోసుకుంటున్నారు..
ఇది కూడా చదవండి:- ధాన్యం తరుగు తీస్తున్న రైస్ మిల్ సీజ్
వ్యవసాయ మార్కెట్ కు భారీగా మిర్చి తరలివచ్చింది.. కానీ అకాల వర్షం రైతన్నలకు షాక్ ఇచ్చింది. గురువారం ఉదయం ఖమ్మం నగరంలో అకాల వర్షం దంచికొట్టింది.. దీంతో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో బస్తాలు తడిసిపోయాయి.. నిండు వర్షంలో రైతులు కాపాడుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆగకుండా వర్షం వస్తుండటంతో రైతులు చేతులెత్తేశారు. దీంతో ఎర్రబంగారం తడిసి ముద్దైంది.. వేలాది బస్తాలు తడిసి పోయాయి. మిర్చి వరదకు కొట్టుకుపోయింది.
ఇది కూడా చదవండి:- సత్తుపల్లి లో దారుణం..ముగ్గురు మృతి
దీంతో రైతులు గగ్గోలు పెట్టారు. రైతులను తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మిర్చి పంటను కొనుగోలు చేస్తారా..? లేదా అని భయపడుతున్నారు. ఇక మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు వర్షార్పణం అయ్యాయి. వర్షానికి ధాన్యం తడిసిముద్దైయ్యాయి. రైతుల గోస పాడుగాను అంటూ చూసేవారు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో..
ఇది కూడా చదవండి:-*కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్*