Telugu News

ఖమ్మం లో ట్రాఫిక్  ఆంక్షలు

భారీగా ఏర్పాట్లు.. 

0

గణేష్ నిమజ్జనం సందర్భంగా ఖమ్మం లో ట్రాఫిక్  ఆంక్షలు

== భారీగా ఏర్పాట్లు.. 

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

వినాయక నిమజ్జనం కోసం  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించినట్లు పోలీస్  కమీషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం నగరంలోని కాల్వ వొడ్డు సమీపంలోని మున్నేరు, ప్రకాష్ నగర్  శివారు ప్రాంతంలోని మున్నేరు వాగు వద్ద గణేశ్ విగ్ర‌హాల నిమ‌జ్జ‌నం ఏర్పాట్లను  చేపట్టారని తెలిపారు.  ట్రాఫిక్ ఆంక్ష‌ల నేపథ్యంలో బుధవారం  (సెప్టెంబర్-27) ప్రజలు గణేష్ శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా  జిల్లా పోలీస్,  రెవిన్యూ, మున్సిపల్ , ఆర్అండ్బీ, వైద్య విధ్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమీషనర్  తెలిపారు . విగ్రహాల నిమజ్జనం ప్రాంతాలలో సీసీ కెమెరాలు, బారికేడ్లను ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్ నిఘాలో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఖమ్మం డివిజన్‌లోని సుమారు వేయి గణేష్  విగ్రహాలను రెండు ప్రాంతాలలో నిమజ్జనం  చేస్తారనే అంచన వుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: ఖమ్మంలో అన్ని సీట్లు  గెలుస్తాం: మంత్రి పువ్వాడ

సకాలంలో  నిమజ్జనం  ముగిసేవిధంగా ఉత్సవ కమిటీలు చొరవ తీసుకొవాలని తెలిపారు. నిమజ్జనం సమయంలో ఒక్కొక్క  వాహనం  వేంటా ఇద్దరని మాత్రమే లోనికి అనుమతిస్తారని తెలిపారు. అన్నివర్గాల ప్రజలు సమన్వయంతో  వ్యవహరిస్తూ గణేష్ నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా తమవంతు సహకారం అందించాలని కోరారు. శోభయాత్రలో సౌండ్ సిస్టమ్ , డిజెల వినియోగం నిషిద్ధమని, వాహనాల డ్రైవర్లు  మద్యం, మత్తు పానీయాలు సేవించవద్దని నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలు, నిర్వహులు పూర్తి సహకారం అందించారని అదే స్పూర్తితో పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో నిమజ్జనం సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 600 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన  బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 27వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి నాయుడు పేట నుండి వచ్చే  అన్ని  వాహనాలను మళ్లించి ములకలపల్లి క్రాస్ రోడ్డు ,బైపాస్ రోడ్డు  మీదుగా  ఖమ్మం టౌన్ లోనికి  అనుమతించబడుతుంది.

== పోలీస్ బందోబస్తు

8మంది ఏసీపీలు, 17 మంది సీఐలు, 40మంది ఎస్ఐలు, 125 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టెబుళ్లు, 281 మంది కానిస్టెబుళ్లు, 106 మంది హోంగార్డు తో పాటు ప్రత్యేక ఏఆర్ టీమ్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు.

== ఖమ్మం నగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగించవలసిన మార్గాలు

> మామిళ్లగూడెం ఏరియా గణేష్ విగ్రహాల ఊరేగింపు మయూరిసెంటర్-కిన్నెర- ZP సెంటర్ – చర్చి కాంపౌండ్ – ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.

ఇది కూడా చదవండి: రైతులను సుభీక్షంగా చూడాలి: పొంగులేటి

Ø  ఆర్టీఏ  కార్యాలయం/బ్యాంక్ కాలనీ ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు ఎన్టీఆర్ సర్కీల్- ఇల్లందు క్రాస్ రోడ్డు- జడ్పీ సెంటర్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్.

== రోటరీ నగర్, ఇందిరానగర్ ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు మమత ఎక్స్ రోడ్ (బీఆర్కే సిల్క్స్- ఇల్లందు క్రాస్ రోడ్ – జడ్పీ సెంటర్- చర్చి కాంపౌండ్ – ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్.

==  కస్బాబజార్ మరియు కమాన్‌బజార్ ప్రాంతంలో గణేష్ విగ్రహాల ఊరేగింపు చర్చి కాంపౌండ్ ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్.

==  గొల్లగూడెం మరియు శ్రీ నగర్ కాలనీ – లకారం ట్యాంక్ బండ్ ప్రాంతం నుండి గణేష్ విగ్రహాల ఊరేగింపు ట్యాంక్ బండ్- టాటా మోటార్స్-చెర్వుబజార్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్  లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్.

ఇది కూడా చదవండి: వచ్చే సాధారణ  ఎన్నికలకు ఏర్పాట్లు వేగంచేయాలి: కలెక్టర్

==  శ్రీరామ్‌హిల్స్‌, ముస్తఫానగర్‌ ప్రాంతం నుంచి గణేష్‌ విగ్రహాల ఊరేగింపు ముస్తఫానగర్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్.

==  ఖమ్మం వైరా రోడ్డు ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు జడ్పీ సెంటర్ చెర్వుబజార్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్.

== సారధినగర్ గాంధీ చౌక్ ప్రాంతం గాంధీ నుండి గణేష్ విగ్రహాల ఊరేగింపు గాంధీచౌక్-నాయుడు సిల్క్స్- పీఎస్ఆర్ రోడ్- గుంటిమల్లన్న – ట్రంక్ రోడ్- నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్..

== గణేష్ నిమజ్జనం ఆనంతరం వాహనాల తిరుగు ప్రయాణం

1)      రూట్ నెంబర్ I 

మున్నేరు – పంపింగ్ వెల్ రోడ్డు – త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ – హరకర బావి సెంటర్ -మూడు బోమ్మల సెంటర్ -బోస్ బోమ్మ సెంటర్ – చర్చికంపౌండ్

2) రూట్ నెంబర్ – II

మున్నేరు –  కాల్వవోడ్డు- నెహ్రూనగర్- ఎఫ్ సిఐ- రాపర్తి నగర్ బైపాస్ రోడ్డు – ఎన్టీఆర్‌ సర్కిల్

3)రూట్ నెంబర్ – III

ప్రకాష్ నగర్ మున్నేరు – సెయింట్ జోసెఫ్ సెంటర్ – చర్చి కంపౌండ్