మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం
భద్రాచలం పట్టణంలో దారుణం.. వీధుల్లో ఉన్న మహిళా హెడ్ కానిస్టెబుల్ మృతి
మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం
== భద్రాచలం పట్టణంలో దారుణం.. వీధుల్లో ఉన్న మహిళా హెడ్ కానిస్టెబుల్ మృతి
== విషాదంలో భద్రాద్రికొత్తగూడెం పోలీస్ శాఖ
(భద్రాచలం-విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శనివారం జరుగుతున్న మంత్రుల పర్యటనలో విషాదం నెలకొంది.. మంత్రుల పర్యటన సందర్భంగా విధులు నిర్వహిస్తున్న మహిళా హెడ్ కానిస్టెబుల్ మురుగు కాల్వలో పడి చనిపోయిన సంఘటన భద్రాచలం పట్టణంలో చోటు చేసుకుంది. దీంతో భద్రాద్రికొత్తగూడెం పోలీస్ శాఖ విషాదంలో మునిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, రాష్ట్రర వాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం పర్యటించారు. ముందుగా ఖమ్మం జిల్లాలోని వైరా, ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రులు, ఆ తరువాత మధ్యాహ్నం సమయానికి భద్రాచలం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అయితే భద్రాచలంలో కుండపోత వర్షం కురవడంతో హెలికాప్టర్ వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. వాతావరణం సహాకరించకపోవడంతో మంత్రుల పర్యటన రద్దైయ్యింది. అయితే మంత్రుల పర్యటిన సందర్భంగా ఏజెన్సీ మండలం కావడంతో భారీ బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీలతో పాటు సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడికానిస్టెబుళ్లు, ప్రత్యేక టీమ్స్ ను బందోబస్తు డ్యూటీలు వేశారు. పోలీసులు ఆ డ్యూటీల ప్రకారం బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో భద్రాచలంలో భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.
allso read- చచ్చిన పీనుగు కాంగ్రెస్ పార్టీ: మంత్రి కేటీఆర్
భారీ వర్షానికి రామాలయం అన్నదాన సత్రం సమీపంలో భారీగా వర్షపునీరు చేరింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న కొత్తగూడెం పోలీస్ కంట్రోల్ రూమ్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీదేవి ఒడ్డు ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేయగా, మురుగు కాలువలో ప్రమాదవశాత్తు కాలుజారీ పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు మొత్తుకున్నప్పటికి భారీగా కురుస్తున్న వర్షతాకిడికి వస్తున్న వరద ఉద్రిత్తికి ఆమెను కాపాడలేకపోయారు. దీంతో స్పందించిన జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బ్రుందాలు కూడా రంగంలోకి దిగాయి. రామాలయం వద్ద కాల్వలో కొట్టుకుపోయిన శ్రీదేవి అనే మహిళా హెడ్ కానిస్టేబుల్ ను కరకట్ట స్లుఇజులు వద్ద హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బ్రుందాల వారు బయటకు తీశారు. దీంతో భద్రాచలం పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.. ఎంతో నిజాయితీగా విధులు నిర్వహించే శ్రీదేవి లేకపోవడంతో తోటి ఉద్యోగులు కన్నీరుమున్నీరైయ్యారు. ఆమె భర్త స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. దీంతో జిల్లా పోలీసాధికారులు ఆమె మతిపట్ల సంతాపం తెలిపారు.
allso read- కాంగ్రెస్ తుంగ పూస లాంటిది: పువ్వాళ్ల