Telugu News

చంద్రబాబు రోడ్ షోలో విషాదం..8మంది కార్యకర్తలు మృతి

భారీగా తరలివచ్చిన జనం.. కాలువలో పడిపోయిన పదుల సంఖ్యలో కార్యకర్తలు

0

చంద్రబాబు కందుకూరి సభలో విషాదం..

== తొక్కిసలాట లో కాలువలో పడ్డ కార్యకర్తలు..

==8మంది మృతి..పలువురికి గాయాలు..

== మృతుల్లో ఇద్దరు మహిళలు

== 10లక్షల అర్థిక సహాయాన్ని ప్రకటించిన చంద్రబాబు

== రోడ్ షో నిలిపివేసి ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు, టీడీపీ నేతలు

== అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట

(అమరావతి-విజయంన్యూస్)

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కందుకూరిలో నిర్వహించిన రోడ్ షో సభలో విషాదం జరిగింది.. రాజకీయ సభ కాస్త సంతాప సభగా మారింది..  సభ జరుగుతుండగా, చంద్రబాబు మాట్లడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగింది… దీంతో చిన్న కాలువలో కార్యకర్తలు పడిపోవడంతో 8మంది చనిపోయిన విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కందుకూరులో బుధవారం చోటు చేసుకుంది. మీటింగ్ జరుగుతుండగానే ఎక్కువ మంది జనం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసాలటలో పక్కనే ఉన్న చిన్న కాలువలో కుప్పకూలిపడిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు వారిని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. వారందరిని స్థానిక ఆసుపత్రులకు తరలించగా, చికిత్స పొందుతూ 8మంది చనిపోయారు. ముందుగా కాలువలో పడిపోయిన వారిపై ఎక్కువ మంది పడిపోవడంతో వారు ఊపరి ఆడలేక చనిపోయినట్లుగా చెబుతున్నారు. కాగా మరికొంత మంది  తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్ల తెలుస్తోంది. అందులో మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు.  దీంతో కందుకూరులో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయకుడు తక్షణమే రోడ్ షోను నిలిపివేసి, సభను నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరిశీలించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం చనిపోయినవారిని పరిశీలించిన చంద్రబాబు వారి కుటుంబాలను ఓదార్చారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి రూ.10లక్షల చొప్పున అర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని అన్నారు.