Telugu News

రాజంపేటలో విషాదం.. 12 మృతదేహాలు వెలికితీత.

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.

0

రాజంపేటలో విషాదం.. 12 మృతదేహాలు వెలికితీత.

(కడప – విజయం న్యూస్) :-

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలో భారీ వర్షాలకు పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. రాజంపేటలోని అన్నమయ్య ప్రాజెక్టు భారీగా తెగిపోవడంతో పెద్ద ఎత్తున చెయ్యేరు నదికి నీటి ప్రవాహం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఉదయం దాదాపు 30మంది వరకు చెయ్యేరు నదిలో కొట్టుకుపోయినట్టు వార్తలు వచ్చాయి. అక్కడ గల్లంతైన వారితో పాటు ఇప్పటివరకు నియోజకవర్గంలో 12 మృతదేహాలను వెలికితీశారు. ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయిన ఘటనలో   కండక్టర్‌, ఇద్దరు ప్రయాణికుల మృతిచెందారు. అలాగే, మందపల్లి వద్ద రెండు మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. తాజాగా నందులూరు మండలంలోని గండ్లూరు శివాలయం వద్ద 7 మృతదేహాలను వెలికితీశారు.

also read :-నేడు భారీ వర్షాలు.