Telugu News

సత్తుపల్లి లో దారుణం..ముగ్గురు మృతి

పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వివాహిత

0

సత్తుపల్లి లో దారుణం..ముగ్గురు మృతి

== పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న వివాహిత

== ఎన్టీఆర్ నగర్ లో మిన్నంటిన రోదనలు

(సత్తుపల్లి-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన సత్తుపల్లి పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి:- అక్రమ సంబంధంతో భర్తను హతమార్చిన భార్య: సీఐ మురళీ

పూర్తి వివరాల్లోకి వెళ్తే సత్తుపల్లి పట్టణంలోని  తామర చెరువులో ఇద్దరు పిల్లలతో  దూకి బల్వన్మరనానికి పాల్పడ్డింది.  వివాహిత సత్తుపల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసులుగా గుర్తించారు. పాటిబండ్ల మృదుల (40), ప్రజ్ఞాన్ (8), మహాన్ (5)కుటుంబ కళహాలే కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు చెరువులో పడిన వారి కోసం గాలింపు చేపట్టారు. చివరికి ముగ్గురు దొరకగా వారు విగతజీవులైయ్యారు. దీంతో సత్తుపల్లిలో విషాదం నెలకొంది. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- మణిపూర్ నుంచి సేఫ్ గా ఖమ్మంకు