తెలుగు సిని పరిశ్రమలో విషాదం
*ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ మృతి*
** చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన కైకాల
** రేపు స్వగ్రామంలో అంత్యక్రియలు
(సినిమా-విజయం న్యూస్)
తెలుగు సిని పరిశ్రమలో విషాదం నెలకొంది.. మాటలు మాంత్రికుడు.. యుముండా అంటూ అందర్ని అలరించి విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్య నటుడుగా అనేక వేషాలతో అలరించిన కైకాల సత్యనారాయణ ఇక లేరు. వేలాది సినిమాల్లో నటించిన సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సినిపరిశ్రమ మరో మంచి నటుడ్ని కోల్పోయింది.
ఇది కూడా చదవండి: బాబు నీ రుబాబు ఇక్కడ నడవది: మంత్రి పువ్వాడ
ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో ఈ వేకువజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో
సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కైకాల మృతితో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం
చేస్తున్నారు. కైకాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ‘అలిబాబా నూరు దొంగలు’ పాలన: అగునూరి మురళీ
కృష్ణాజిల్లా కౌతవరం గ్రామంలో 1935న సత్యనారాయణ జన్మించారు. గుడివాడ కాలేజీలో ఆయన గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. నటనపై ఉన్న ఆసక్తితో కాలేజీ రోజుల్లోనే ఆయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. సత్యనారాయణలోని టాలెంట్ను ప్రముఖ నిర్మాత డీఎల్ నారాయణ గుర్తించి ‘సిపాయి కూతురు’లో అవకాశం ఇచ్చారు. పౌరాణికం, జానపదం, కమర్షియల్.. ఇలా ఎన్నో చిత్రాల్లో హీరో, విలన్గా ఆయన కనిపించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్బాబుతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ తదితరుల చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో సత్యనారాయణ నటించారు. యమధర్మరాజు, దుర్యోధనుడు, ఘటోత్కచుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, భరతుడు, రావణాసురుడి పాత్రల్లో ఆయన మెప్పించారు.
ఇది కూడా చదవండి:- సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
‘కృష్ణార్జున యుద్ధం’, ‘లవకుశ’, ‘నర్తనశాల’, ‘పాండవ వనవాసం’, ‘శ్రీ కృష్ణ పాండవీయం’, ‘శ్రీకృష్ణావతారం’, నటించారు. ‘మహర్షి’ తర్వాత ఆయన స్క్రీన్పై కనిపించలేదు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. లోక్సభ ఎంపీగానూ సేవలు అందించారు.
‘వరకట్నం’, ‘పాపం పసివాడు’, ‘మానవుడు దానవుడు’, ‘యమగోల’, ‘సోగ్గాడు’, ‘సీతా
స్వయంవరం’, ‘అడవి రాముడు’, ‘దానవీరశూర కర్ణ’,
‘కురుక్షేత్రం’, ‘డ్రైవర్ రాముడు’, ‘అగ్నిపర్వతం’,
‘విజేత’, ‘కొండవీటి దొంగ’, ‘కొదమసింహం’,
‘యమలీల’, ‘అరుంధతి’ చిత్రాల్లో ఆయన నటించారు. ‘మహర్షి’ తర్వాత ఆయన స్క్రీన్పై కనిపించలేదు. రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. లోక్సభ ఎంపీగానూ సేవలు అందించారు.