Telugu News

రైలులో చెలరేగిన మంటలు..

పెద్దపెల్లి, రాఘవపూర్ మధ్య ప్రమాదం

0

*రైలులో చెలరేగిన మంటలు..

** పెద్దపెల్లి, రాఘవపూర్ మధ్య ప్రమాదం*

(మంచిర్యాల-విజయం న్యూస్)

రైలులో చెలరేగిన మంటలు.. పెద్దపెల్లి, రాఘవపూర్ మధ్య ప్రమాదందిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​లో మంటలు చెలరేగాయి. శనివారం  చెన్నై వెళ్తున్న జీటీ ఎక్స్​ప్రెస్​.. పెద్దపెల్లి జిల్లాలోని రాఘవపూర్- పెద్దపల్లి రైల్వే స్టేషన్​ల మధ్యకు రాగానే.. రైలు కింద భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన రామగుండం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది.. ఫైర్ ఫైటర్స్​తో మంటలను ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. త్వరితగతిన అప్రమత్తమై మంటల్లో ఆర్పి వేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.

All so read :- సర్కారి గడిలో రాజకీయ గలాట