అదనపు కలెక్టర్ల బదిలీ
== ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం
(హైదరాబాద్-విజయంన్యూస్)
రాష్ట్రంలోని పలు జిల్లాలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ కల్గిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్ల పదోన్నతలతో పాటు బదిలీలు చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. వేయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులను ఇచ్చారు. హైకోర్టులో కేసు దాఖలు అయిన వెంటనే వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు అదనపు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది.
also read :-ప్రజల కోసమే ఇంటింట జ్వర సర్వే : హారీష్ రావు
ఈ ఉత్తర్వుల ప్రకారం.
పోస్టింగ్ లు ఇలా
జగిత్యాల అదనపు కలెక్టర్‌గా బీఎస్ లత,
నారాయణ్‌పేట్ అదనపు కలెక్టర్‌గా జి.పద్మజారాణి,
రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్‌గా ఖీమానాయక్
వరంగల్ అదనపు కలెక్టర్‌గా కె . శ్రీవాస్తవ,
ములుగు అదనపు కలెక్టర్‌గా గా వై వి గణెళిష్,
మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్‌గా ఎం డేవిడ్
నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా ఉన్న పీ శ్రీనివాసరెడ్డిని సిద్ధిపేటకు బదీలీ చేశారు.
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ పాలనాధికారి చంద్రమోహన్‌ను కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా
చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్‌కుమార్
హైదరాబాద్ జిల్లా భూపరిరక్షణ ఎన్డీసీగా బీ. సంతోషిని లను ప్రభుత్వం నియమించింది.