Telugu News

ప్రయాణం… నిత్య నరకం…!

👉 ఇక్కడ ప్రయాణం నిత్య నరకం

0

ప్రయాణం… నిత్య నరకం…!

👉 ఇక్కడ ప్రయాణం నిత్య నరకం
👉గుంతలుగా మారిన బీటి రహదారి
👉 మరమ్మతులకు స్పందించని అధికారులు,ప్రజా ప్రతినిధులు
👉 అధికారుల తీరుపై గ్రామస్థుల ఆగ్రహం
👉 పేరుకే ఫ్యాక్టరీలు పట్టించుకున్న దాఖలాలు లేవు
👉 నూతన నిర్మాణం చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు

(బూర్గంపాడ్ -విజయం న్యూస్)

అటవీ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతాలకు సైతం రోడ్డు నిర్మాణాలు పటిష్టంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో పని చేస్తుంది. ప్రభుత్వం నిర్మించిన రోడ్లను ఆ ప్రాంతాల్లోని ఫ్యాక్టరీలకు వచ్చే వాహనాల వల్ల రోడ్లన్నీ గుంతలమయంగా మారుతున్న తిరుకు మండలంలోని లక్ష్మీపురం టేకుల చెరువు బిటీ రోడ్డు ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తుంది.

ఆ రహదారి యమపురి మార్గాoగా మారింది. బూర్గంపాడు మండల పరిధిలోని లక్ష్మిపురం గ్రామం నుంచి టేకుల చెరువు గ్రామానికి వెళ్లే ప్రధాన బిటిరోడ్డు గుంతలగా మారి ప్రయాణికులకు నిత్యం నరకం గా తయారయింది. మరో పక్క నిత్యం ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. లక్ష్మిపురం నుంచి టేకుల చెరువు గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పలు పేపర్ గోడౌన్ లు,ఫ్యాక్టరీలు, ఇతర కంపెనీలు ఉన్నాయి. దీంతో నిత్యం భారీ వాహనాలు ఈ రహదారి గుండా నడుస్తున్నందున రహదారి మొత్తం గుంతలమయంగా మారింది. ద్విచక్ర వాహనలు సైతం వెళ్ళే వీలు లేకుండా ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రహదారి మీదగా వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి ఉందని వాహనదారులు వాపోతున్నారు. ఐటీసీ బిపిఎల్ కు చెందిన అనుబంధ మార్గంలో ఉన్నందున భారీ వాహనాలు వెళ్తున్నాయని, ఆయా భారీ వాహనాల వల్ల బీటీ రోడ్డు మొత్తం పాడైందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు. పెద్దపెద్ద కంటైనర్లు రహదారి పై గల గోతుల్లో దిగబడి గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, ఆ సమయంలో ప్రయాణం సాగాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వలసిందే గ్రామస్తులు చెబుతున్నారు. బిటి రోడ్డు నిర్మాణం జరిగింది సుమారు 15 సంవత్సరాలు దాటిన నేటి మరమ్మత్తులు నోచుకోలేదు అంటే అధికారుల, ప్రజా ప్రతినిధుల పనితీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. బూర్గంపాడు మండలం లో పలు గ్రామాలలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నట్లు వెలుగులోకి వస్తున్న అధికారుల, ప్రజా ప్రతినిధుల కంటికి కనపడకపోవడం గమనాహారం. మూడేళ్లుగా లక్ష్మిపురం నుంచి టేకుల చెరువు గ్రామానికి వెళ్లే ప్రధాన బిటి రోడ్డు దుస్థితి అద్వానంగా ఉన్న నేటికీ రోడ్డు బాగు చేయకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఈ మధ్యకాలంలో ధనలక్ష్మి రైస్ మిల్ ప్రాంతంలో మూలమలుపు వద్ద భారీ పేపర్ కంటైనర్ రహదారి పై గల గుంతలో దిగబడి 5 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ద్విచక్ర వాహనం కూడా ఆ సమయంలో వెళ్లే పరిస్థితి లేదని గ్రామస్తులు మండిపడ్డారు. నిరసన వ్యక్తంచేసి ధర్నాకు దిగారు. జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత స్పందించి ఐటీసీ వారితో మాట్లాడి రోడ్లు తాత్కాలిక మరమ్మతులు చేశారు. మళ్లీ ఆ రహదారిలో భారీగా గోతులు పడ్డాయి. ఈ మధ్యకాలంలో పత్తి మిల్లు కి వెళ్తున్న లోడుతో ఉన్న ప్రతి లారీ ఆ గోతిలో దిగబడి కింద పడిన సంఘటన చోటు చేసుకుంది. దాదాపు నాలుగైదు గంటలసేపు భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మా రోడ్డు కు నూతన నిర్మాణం చేపట్టాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

పట్టించుకోని ఫ్యాక్టరీల యజమానులు…
లక్ష్మీపురం నుండి టేకుల చెరువు రహదారి గుండా ఉన్న పలు ఫ్యాక్టరీ లు రోడ్డు మరమ్మతులు చేయడం ఎలా పూర్తిగా విఫలమయ్యాయనే ప్రజలు చెబుతున్నారు. 10 నుంచి 15 టన్నుల బరువు ను మోసే ఈ బిటి రోడ్డు ఫ్యాక్టరీలకు వచ్చే భారీ వాహనాల బరువు సైతం మోస్తుంది. సుమారు 30 టన్నులకు పైనే ఒక్కో లారీ కలిగి ఉండటంతో రోడ్డు ముక్కలు చెక్కలుగా మారిందని ఈ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా రోడ్డు గుంతల మయంగా మారిన ఏ ఒక్క ఫ్యాక్టరీ యజమాని పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. అర్ధరాత్రి ఆపద వస్తే ఈ రోడ్డు మార్గం గుండా ఆటోలు పోవాలన్నా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు . పేరుకే ఫ్యాక్టరీలు గ్రామాభివృద్ధి మాత్రం రూపాయి ఖర్చు చేయవని, వారి వాహనాలు నిత్యం తిరిగినా మాకేంటి అనే ధీమా వ్యక్తం చేయడమే ఆయా ఫ్యాక్టరీల యాజమాన్య తత్వం అని గ్రామస్తులు మండి పడుతున్నారు. గ్రామస్తుల ప్రయాణ ఇబ్బందులను గుర్తించి నూతనంగా బిటి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

పాండవుల బిక్షం (టేకుల చెరువు )

టేకులచెరువు నుండి లక్షిపురం వెళ్లే ప్రధాన రహదారి గోదాముల వల్లనే గోరమైన గుంతలు ఏర్పడినవి.పెద్ద పెద్ద కంటైనర్లు హెవీలోడ్ తో తిరగడం వల్లనే రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. గోదాముల యాజమాన్యం పరిమితి కి మించి లోడ్ లారీలు నడపటం వల్లనే రోడ్డు పాడయ్యాయి.ఇట్టి విషయమై గ్రామస్తులతో ధర్నా చేస్తే కొంచెం టైం కావాలని యాజమాన్యం కోరింది. ఐటీసీ మేనేజర్ ని కలిసి సమస్యను వివరించాగా గోదాము యాజమాన్యం తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.కానీ సమస్య పరిస్కారం వైపు ఎవ్వరు ప్రయత్నం చేయలేదు.ఈ రోడ్డు గోతులవలన 7 గ్రామాల ప్రజలు, వాహనదారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి కైనా ఈ రోడ్డు ను పోసి సమస్య కు పరిస్కారం చూపాలి. లేకపోతే చుట్టూ ప్రక్కల గ్రామ ప్రజలు గోదాముల కు వెళ్లే లారీలను. ఆపి పోరాటం తీవ్రతరం చేయవలసి వొస్తుంది.

!

also read ;-భారత్ లో కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్,ఎపి రాష్ట్రాల్లో ఒమిక్రా.న్…