Telugu News

చెట్లను మింగేస్తున్న కలప తిమింగళాలు…?

** యథేచ్ఛగా అక్రమ కలప రవాణా

0

చెట్లను మింగేస్తున్న కలప తిమింగళాలు…?

** యథేచ్ఛగా అక్రమ కలప రవాణా

** నీరు గారి పోతున్న హరితహారం లక్ష్యం

** నిర్లక్ష్యంగా అధికారులు..యదేచ్చగా అక్రమ రవాణా

** అధికారులకు నెలవారీ మామూళ్లు అక్రమ పర్మిషన్ లే వారికి అండా..?

(మహబూబాబాద్-విజయం న్యూస్);-

ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమంలో నర్సరీల్లో కోట్ల మొక్కలు,పెంచి నాటుతు యజ్ఞంలా చేపడుతు పెరిగిన చెట్లను మాత్రం కాపాటంలో నిర్లక్ష్యం వల్ల అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ కృషిని ,శ్రమను భూడిదలో పోసిన పన్నీరు లామార్చుతున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం కొంతమంది అధికారుల అలసత్వంతో కాగితాలకే పరిమితమైంది, వన సంపద సంరక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టం, క్షేత్ర స్థాయి అధికారులు-అక్రమార్కుల దోస్తీ తో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది
వృక్షో రక్షతి రక్షితః అనే అర్థం మరిచిన సంభందిత అధికారులు

జిల్లా వ్యాప్తంగా స్మగ్లర్లు అక్రమంగా కలపను రవాణా చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు . ఈ విషయం అధికారులకు తెలిసినా ..చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపనలు వినిపిస్తున్నాయి . ఆధునిక యంత్రాలను వినియోగించి మోటార్ రంపాలతో భారీ వృక్షాలను గుట్టుచప్పుడు కాకుండా నరికి వేస్తూ నరసింహుల పేట,చిన్న గూడూరు,మండలంలో కలప అక్రమ రవాణా వ్యాపారులు తమ అనుచరులతో అధికారులకు నెలవారీ మామూళ్ళ ను ముట్టజెప్పిస్తున్నట్లు మండలంలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి

నెలవారీ మామూళ్లు కి అలవాటు పడ్డ అధికారులు నిత్యం నరసింహులపేట,చిన్న గూడూరు మండల కేంద్రాలగుండా భారీ వాహనాలలో తరలిస్తున్నా చూసి చూడనట్టు వ్యవహరించడంతో తమ దందాను మూడు పువ్వులు, ఆరుకాయలుగా సాగిపోతున్నాయని మండిపడుతున్నారు.వేప తుమ్మ ,మర్రి ,నమిలి, నార,చింత ,బొడ్డు మళ్ళీ,గా పిలిచే బారి చెట్లను సైతం అక్రమార్కులు వదలడం లేదని, పంట పొలాలు, చేలు వెంబడి గుట్టల ప్రాంతాలోని చెట్లు , రోడ్డుకు ఇరువైపులా పెరిగిన చెట్లను రోజుకు వందలాది వృక్షాలు నేలకులుస్తున్నారు,పగలు వేళలో డంపులు ఏర్పాటు చేస్తూ, రాత్రి వేళల్లో డీసీఎం, లారీలు వంటి భారీ వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు .

చెట్ల నరికివేత పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయిలు కేటాయిస్తూ హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు కలప రవాణా దారులు పెద్ద పెద్ద వృక్షాలను నేలకూల్చుతున్నారనీ చెట్లు నరికే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ,అక్రమ కలప రవాణా కు సహకరిస్తున్న అదికారులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

also read;-అంతా షాడో మయం..