Telugu News

ఆదివాసీలకు అందని ఐటిడిఏ అభివృద్ధి ఫలాలు

ఐటిడిఎ లో అంతులేని అవినీతి

0

ఆదివాసీలకు అందని ఐటిడిఏ అభివృద్ధి ఫలాలు

▪️ఐటిడిఎ లో అంతులేని అవినీతి
▪️నిధుల కొరత
▪️ రాజకీయ ప్రాబాల్యం
▪️గిరిజనేతర వర్గాల ఆదిపత్యం
▪️ఐటీడీఏ ఖర్చు చేసిన నిధుల పై శ్వేతా పత్రం విడుదల చేయాలని ఆదివాసీల డిమాండ్.

(గుండాల-విజయంన్యూస్)
ఆదివాసీల సమగ్రఅభివాద్దికి నేటి నాటి పాలకులు ఎన్నో సంక్షేమ పధకాలు మరియు రకరకాలైనా సంస్థలు ఉన్నప్పటికిని ఆదివాసీలకు మాత్రం ఏమాత్రం ఉపయోగపడటంలేదు. ఆదివాసీల సంక్షేమానికి కొన్ని వేల కోట్లు కేటాయిస్తున్నప్పటికిని మద్యలో దళారులు గిరిజనేతరులు దోపిడి మూలంగా పక్కదారి పడుతున్నాయి. ఆదివాసీలను అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ఐటిడిఏ సంస్థను 1975లో ఖమ్మంలో ఏర్పాటు చేశారు. పాలన సౌలభ్యం కోసం17-12-1979లో పాల్వంచకు మార్చారు. ఆదివాసీలకు అన్నిరంగాల్లో మెరుగైనా నాణ్యతమైనా అన్ని అంగులతో అభివృద్ధి చేయడం కోసం నూతన భవనాన్ని నిర్మించి భద్రాచలంలో ఏర్పాటు చేశారు. భద్రాచలం సబ్ ఏరియా మొత్తం 12175 స్కేర్ కిలోమీటర్లలో ఉంది. భద్రాచలంలో ఆదివాసీల జనాభ 1991లెక్కల ప్రకారంకోయా తెగ 5.60శాతంగా ఉంది.

ప్రిలిమిటివ్ ట్రైబల్ గ్రూప్ మండలాలు ఉన్నాయి.65గ్రామాల్లో పిటిజి ఆదివాసీలు ఉన్నారు. వీరిని అత్యంత ప్రాచీనమైనా ఆదివాసీ తెగగా గుర్తించారు. ఐటిడిఏలో 1991జనాభ లెక్కల ప్రకారం కోయా2.31లక్షలు ఉ న్నారు.లంబాడీలు1.90.కొండరెడ్లు0.10 ఉన్నారు. ఆదివాసీల కోసం భారీస్థాయిలో ఐటిడిఏ సంస్థని నిర్మాణం చేసుకున్నప్పటికిని ఆ సంస్థలో బారీ ఎత్తున అవినీతిదళారీతనం రాజ్యమేలుతున్నాయి. ఐటిడిఏలో 30ప్రభుత్వ శాఖలో కూడ అగ్రవర్ణ గిరిజనేతర అధికారులు ఉండటం మూలంగా ఐటిడిఏ సంక్షేమ పథకాలు నిజమైనా ఆదివాసీలకు అందడం లేదు.
యన్టీ జాబితాలో కలపబడిన లంబాడీలు నేడు యస్టిలు గా చెలమాణి అవుతు నిజమైనా ఆదివాసీల రిజర్వేషన్స్ విద్య ఉఫాది అవకాశాలను కొల్లగొడుతు భద్రాచలంలో ఐటిడిఏ లో 90శాతం పధకాలు నిధులు కబ్జా చేస్తున్నారు.యస్టి అంటే లంబాడీలు అనే స్థాయికి దిగజారిపోయారు. భద్రాచలంలో ఐటిడిఏలో 99శాతం ఉద్యోగాలను వారే దోచుకోవడంతో ఆదివాసీల పరిస్థితి అద్వాన్నంగా తయారైంది. భద్రాచలం ఐటిడిఏ మొత్తం గిరిజనేతరులు లంబాడీల కనుసైగలలో నుంది. ఆదివాసీలు పదవతరగతి పాస్అయితే ఉద్యోగాలు ఇవ్వాలనిజివోనెం.70 ఉన్నప్పటికిని భద్రాచలం ఐటిడిఏ అధికారులు నిర్లక్ష్యం మూలంగా అమలుకు నోచుకోవడంలేదు. భద్రాచలంలో అన్ని ప్రభుత్వ శాఖలో ఎక్కువగా గిరిజనేతరులు ఉద్యోగం చేస్తు ఆదివాసీలకు అటెండర్ ఉద్యోగం కూడ రాకుండా చేస్తున్నారు. ఐటిడిఏ భద్రాచలంలో 90శాతం గిరిజనేతరులే ఉ ద్యోగం చేస్తూ ఆదివాసీలకు రాకుండా అందాల్సిన సబ్సిడిని కూడ రాకుండా చేస్తున్నారు.

ఐటిడిఏలో కొన్ని శాఖలో ఉన్నత ఉద్యోగాలు గిరిజనేతరులు చేస్తు అటెండర్ స్థాయి ఉద్యోగాలు ఆదివాసీలు చేసే పరిస్థితికి దిగజారిపోయారు. ఆదివాసీలు ఐటిడిఏకు వస్తే వారి భాష వేషదారణ చూసి వెక్కిరించే పరిస్థితి అవమానించే పరిస్థితి నేడు ఉంది. భద్రాచలంలో ఐటిడిఏ అడుగడుగనా అవనీతి అక్రమాలు దళారీలు రాజ్యమేలుతున్నాయి. ఆదివాసీల సంక్షేమం కోసం వందల కోట్లు ఖర్చుపెడుతున్నామని ఆదికారులు చెబుతున్నప్పటికినిఅవి నిజమైనా ఆదివాసీలకు అందిన దాఖాలలు లేవు. వందల కోట్లు కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ఐటిడిఏ యంత్రాంగం కాకి లెక్కలు చూపిస్తున్నారు. ఆ కాకి లెక్కలకు ఆడిట్ ఉండదు. జవాబుదారితనం ఐటిడిఏలో బాగా లోపించింది. భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారిగా ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏయన్ అధికారులను నియమిస్తున్నప్పటికిని ఆ అధికారులకు స్థానిక ఆదివాసీ బాషాలపై, ఆదివాసీ సంస్కృతిపై ఆదివాసీ చట్టాలపై సరైనా అవగాహన లేకపోవడంతో అధికార పార్టీ రాజకీయ వత్తిళ్లతో
ఐటిడిఏలు పాలనపరమైనా ఇబ్బందులతో నిర్వీర్యం అవుతున్నాయి. ఆదివాసీల సమగ్ర అభివృద్ధి సమాధి అవుతున్నాయి. దీని మూలంగా ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐటిడిఏ ప్రాజెక్ట్ అదికారులను కనీసం ఐదు సంవత్సరాలు కూడ పదవిలో ఉండనీయకుండా గిరిజనేతర రాజకీయ వత్తిళ్ళతో బదిలీలు చేస్తున్నారు. భద్రాచలం ఐటిడిఏలో మొత్తం రాజకీయ బదిలీలు మాత్రమే జరుగుతున్నాయి. ఐటిడిఏ పిఓగా ఆదివాసీ ప్రాంతాలపై చట్టాలపై సంస్కృతి పై అవగాహన వచ్చేలోపు రాజకీయ ఒత్తిళ్ళతో బదిలీ చేస్తున్నారు. దీని మూలంగా ఐటిడిఏ పిఓలు సమర్ధవంతంగా పని చేయలేకపోతున్నారు. ఆదివాసీల చట్టాలు జీవోలు సక్రమంగా అమలు చేయాల్సిన అధికారులే వాటిని త్రుంగలో తొక్కుతున్నారు.భద్రాచలం ఐటిడిఏలో గిరిజనేతర అగ్రవర్ణ భావజాలం అధికారులపై స్పష్టంగా పనిచేస్తుందని అర్ధం చేసుకోవాలి.1/70 చట్టం, పీసా ,యసి యస్టి ఎట్రాసిటీ చట్టం, యల్టిఆర్ చట్టలం నీరుగారిపోతున్న కూడ ఐటిడిఏ అదికారులు నిమ్మకునీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.భద్రాచలంలో ఐటిడిఏలో రాజకీయ పలుకుబడి పైరవీలు ఉన్నవారికే పనులు జరుగుతున్నాయి. ఆదివాసీలకు ఎలాంటి రాజకీయ పలుకుబడి లేక మాట్లాడే విధానం రాక ఐటిడిఏలో వారికి కావాల్సిన పనులు జరగడం లేదు. ఐటిడిఏలు నిజంగా ఆదివాసీలకు ఎంతవరకు ఉ పయోగపడ్డాయో తెలవదు కాని గిరిజనేతరులకు వలస లంబాడీలకు మాత్రం చాలా రకాలు గా ఉపయోగపడుతున్నాయి. ఐటిడిఏ అధికారులు యల్టిఆర్ కేసులు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. భద్రాచలం ఐటిడిఏ పరిదిలో ఏజన్సీలో ఆదివాసీ లభూమిని గిరిజనేతరులు చట్టవిరుద్దంగా కబ్జా చేస్తుంటే ఏనాడు యల్టిఆర్ కేసులు నమోదు చేసిన పాపన పోలేదు. ఐటిడిఏ పాలకవర్గ సమావేశాలు ప్రతి సంవత్సరం రెండు సార్లు జరగాల్సి ఉండగా గత ఐదు సంవత్సరాలుగా జరగకుండా ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.

ఆదివాసీలకు ఇంత నష్టం జరుగుతున్న కూడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదుగురు యస్టి యంయల్ఎలు ఉన్న కూడ ఏనాడు ఐటిడిఏ లో జరుగుతున్న వ్యవహరాలపై నోరు విప్పిన సందర్భాలు లేవు. ఏజన్సీలో ఇసుక ఖనిజసంపద సహజవనరులు అన్ని యదేచ్చగా గిరిజనేతరులు దొడ్డిదారిలో దోచుకుపోతున్న కూడ ఐటిడిఏ అధికారలు లంచాలకు మంచం వేసి ఆదివాసీ చట్టాలను కాలరాస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు ఖమ్మంజిల్లాలో 46 మండలాలకు గాను 29 మండలాలు ఏజన్సి మండలాలుగా గుర్తించారు. 29మండలాలో పూర్తిగా గిరిజనేతరుల పెత్తనమే కొనసాగింది. ఆదివాసీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయ కోణంలో అన్ని పార్టీలు చూస్తున్నారు. ఐటిడిఏ భద్రాచలం పరిదిలో ఏజన్సీ విద్యార్థులకు ఏజన్సి సర్టిఫికెట్ 1956 జనవరి 26 నుండి స్థానికత ఆదారాలతో ఉన్నవారికి మాత్రమే ఏజన్సి సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉండగా అదికారులు లంబాడీలకు కూడ ఇస్తున్నారు. లంబాడీలకు ఏజన్సి సర్టిఫికెట్ ఇవ్వదని రాష్ట్ర గవర్నర్ నుండి ప్రత్యేక జివో కూడా ఉంది. అయిన ఏజన్సీలో పని చేస్తున్న తహసిల్దార్లు రాజకీయ ప్రలోభాలకు లంచాలకు మరిగి ఏజన్సీ సర్టిఫికెట్ ఇస్తున్నారు.

ఏజన్సి సర్టిఫికెట్ విషమై భద్రాచలం ఐటిడిఏ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించిన కూడ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఆదివాసీల చట్టాలు జీవోలు సంస్కృతి సంప్రాదాలయాలు గురించి గవర్నర్ రాష్ట్రపతులు పర్యవేక్షించాల్సి ఉండగా వారు ఏనాడు కూడ పట్టించుకున్న పాపాన పోలేదు.భద్రాచలం ఐటిడిఏ ఆదివాసీల పాలిట శాపంగా మారుతుంది. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్లు ఆదివాసీలకు భారతరాజ్యంగంలో అన్ని చట్టాలు జీవోలు అబివృద్ధి సంక్షేమపధకాలు ఉన్న కూడ ఆదివాసీల దరికి చేరడంలేదు. ఐటిడిఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆదివాసీలకు అందడం లేదు. ఇప్పటి వరకు భద్రాచలం ఐటిడిఏ కి వచ్చిన నిదులు ఎన్ని ఆదివాసీలకు ఖర్చు పెట్టిన నిదులు ఎన్ని, ఎన్ని తెగలకు ఎంత ఖర్చు పెట్టారు శ్వేత పత్రం అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆదివాసీ సంఘాలుఆదివాసీ మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ఏజన్సి పరిదిలో పోలీస్ స్టేషన్లను ఐటిడిఏ నియంత్రణలోకి తీసుకురావాలి.ఐటిడిఏ పరిదిలో ఉన్న ఏజన్సీ మండలలో తహసిల్దార్లుగా యంపిడివోలుగా ఆదివాసీలనే నియమించాలి. భద్రాచలం ఐటిడిఏ లో అటెండర్ స్థాయి నుండి ఐఏయస్ వరకు ఆదివాసీలను నియమించాలి.

ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి.ఐటిడిఏలో అన్ని శాఖలలో ఆదివాసీలనే ఉద్యోగులుగా నియమించాలి.ఐటిడిఏలో జరుగుతున్న అవినీతిపై విచారణ చేయాలి. ఐటిడిఏ ఆద్వర్యంలో ఆదివాసీల విద్యార్థులకు గ్రూప్స్ సివిల్ సర్వీస్ డియస్సి నిర్వహించాలి. ఐటిడిఏ ఆద్వర్యంలో ప్రతి సంవత్సరం ఏజన్సీ డియస్సి గ్రూప్స్ నిర్వహించాలి.ఐటిడిఏ పాలకవర్గ సమావేశాల్లో ఆదివాసీ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి.ఐటిడిఏ పాలకవర్గ సమావేశాలు ప్రతి సంవత్సరం రెండు సార్లు జరిగే విధంగా ఆదివాసీ యంయల్ఎలు చొరవ తీసుకోవాలని ఆదివాసీలు కోరుతున్నారు.

also read ;-తెలంగాణకు అమూల్‌.. రూ.500 కోట్ల పెట్టుబడి