Telugu News

ఎన్టీఆర్‌ కు నివాళ్లు అర్పించిన బాలయ్య

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన బాలయ్య కుటుంబం

0

ఎన్టీఆర్‌ కు నివాళ్లు అర్పించిన బాలయ్య
== ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించిన బాలయ్య కుటుంబం
== ఎన్టీఆర్‌ ను కొనియాడిన జూనియర్‌ ఎన్టీఆర్
(హైదరాబాద్‌-విజయంన్యూస్)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని … ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. నందమూరి రామకృష్ణ, సుహాసిని ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద అంజలి ఘటించారు. అనంతరం బాలకృష్ణ విూడియాతో మాట్లాడుతూ… ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్‌ నిలిచిపోయారని, తెలుగుజాతి ఉన్నంతవరకు ఆయనను మరచిపోలేరని అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. మాట తప్పని ఎన్టీఆర్‌ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం, తెలుగు ఖ్యాతిని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారని కొనియాడారు.

also read :-దేశంలో విజృంభిస్తోన్న కరోనా

బడుగు బలహీన వర్గాల, పీడిత
ప్రజలకు పదవులు ఇచ్చారని అన్నారు. తెలంగాణలో 610 జిఒ తీసుకొచ్చింది..ఎన్టీఆరేనని, స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని 610 జిఒ లో అమలు చేశారని గుర్తు చేశారు. స్థానికతపై ఇప్పుడు మళ్లీ ఉద్యమాలు జరుగుతున్నాయన్నారు. ఉపాధ్యాయులు నిరసన తెలుపుతున్నారు అని బాలకృష్ణ పేర్కొన్నారు.

also read :-ఏపిలో కరోనా విలయతాండవం

నందమూరి తారక రామారావు.\.

ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. తెలుగు చిత్ర పరిశ్రమకే వన్నెతెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్‌. రంగం ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా ఆయన దిగనంత వరకే.. చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగరాయాలన్నా కేవలం ఎన్టీఆర్‌ వలనే అవుతుంది. ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తావన తెస్తే మొదట వినిపించేది నందమూరి తారక రామారావు పేరే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా కళామ్మ తల్లికి, ప్రజలకు ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్‌ 1996, జనవరి 18 న కన్నుమూశారు. ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి కావడంతో నందమూరి అభిమానులు సహా ఆయన కుటుంబీకులు మరోసారి ఆయన పేరు గుర్తు చేసుకుంటున్నారు. ఇక తారక్‌ తో పారు మరో మనవడు, హీరో కళ్యాణ్‌ రామ్‌ సైతం తాతను గుర్తుచేసుకొని ట్వీట్‌ చేశారు.