త్రిసభ్య కమిటీ భేటీ.. ఐదు అంశాలపై కుదరని ఏకాభిప్రాయం
(తెలంగాణ విజయం న్యూస్):-
ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలపై కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రిసభ్య కమిటీ భేటీలో ఐదు అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. దాదాపు గంటపాటు సాగిన చర్చలు అసంపూర్తిగా ముగిసాయి.సివిల్ సప్లై కార్పొరేషన్ల ఆర్థిక వ్యవహారాలు, విద్యుత్ బకాయిలు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వ్యవహారాలపై చర్చ సాగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు తమ తమ వాదనలను బలంగా విన్పించారు. అయితే ఏ అంశంపైన ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో సంబంధిత శాఖలు పరస్పరం చర్చలు జరపాలని నిర్ణయించారు.
also read :-కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం: పొంగులేటి
కేంద్ర ప్రభుత్వమే ఈ అంశాలపై ఒక నిర్ణయానికి రావాలి అని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంటున్నాయి. ఏపీ తరఫున సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, శ్రీకాంత్, మీనా తదితర అధికారులు పాల్గొనగా.. తెలంగాణ తరపున రామకృష్ణా రావు, ప్రభాకర్ రావు, జయేష్ రంజన్, నీతూ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.