Telugu News

త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా..?

== కమ్యూనిస్టులను ఓడిచ్చిన నాయకుడికే తప్పలేదంటే..?

0

త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా..?

== కమ్యూనిస్టులను ఓడిచ్చిన నాయకుడికే తప్పలేదంటే..?

(హైదరాబాద్-విజయం న్యూస్);-

త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. బీజేపీ అధిష్టానం ఆదేశంతో ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. 2018 మార్చిలో 25 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు బిప్లవ్ చేసిన క్రుషి అంతా ఇంతా కాదు.. ఆయన స్టారీజం, కేంద్ర ప్రభుత్వ మద్దతతో కమ్యూనిస్టుల కంచుకొట త్రిపుర రాష్ట్రంలో మంచి మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఈ క్రమంలో బీజేపీ అదిష్టానం త్రిపుర సీఎంగా బిప్లవ్ ను ఎంపిక చేసింది.

also read;-ఘనంగా సుదర్శన చక్ర ప్రతిష్ఠా మహోత్సవం.

ఆయన పనిచేసిన కాలంలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న తరుణంలో పదవీ కాలం పూర్తి కాకుండానే బిప్లవ్ రాజీనామా చేయడం గమనార్హం. దీంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.. అదిష్టానం ఎందుకు ఆ విధంగా రాజీనామా చేయించిందనే విషయంపై క్లారిటీ రాలేదు.. కానీ బిప్లవ్ కు రాజ్యసభ స్థానం అవకాశం కల్పించి కేంద్రమంత్రిని చేసే అవకాశం ఉందని సమాచారం.