Telugu News

అక్టోబర్ 6న ముహుర్తమా..?జాతీయ పార్టీ కోసమా..? హ్యాట్రిక్ కోసమా

వేగంగా రాజకీయ అడుగులేస్తున్న సీఎం కేసీఆర్

0

అక్టోబర్ 6న ముహుర్తమా..?

== జాతీయ పార్టీ కోసమా..? హ్యాట్రిక్ కోసమా

== త్వరలో ఎన్నికలు రాబోతున్నాయా..?

== వేగంగా రాజకీయ అడుగులేస్తున్న సీఎం కేసీఆర్

== నేడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

== ముప్పై మూడు జిల్లాల పార్టీ అధ్యక్షులు,మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశం.

== తెలంగాణలో ఏం జరుగుతోంది..?

== కేసీఆర్ అడుగులను అసక్తిగా గమనిస్తున్న రాజకీయ నాయకులు, విశ్లేషకులు

(ఎడిటర్-పెండ్ర అంజయ్య)

ఖమ్మంప్రతినిధి, అక్టోబర్ 1(విజయంన్యూస్)

సీఎం కేసీఆర్ ఉన్నట్లుండి వేగం పెంచారు.. చకచకపనులు చేస్తున్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీ నాయకులతో నిత్యం అందుబాటులో ఉంటున్నారు.. జిల్లాల పర్యటనలు చేస్తున్నారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆయా నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశిస్తున్నారు.. పెండింగ్ పనులు పూర్తి చేయాలని, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు చెప్పకనే చెప్పారు.. దేవాలయ దర్శనాలు చేస్తున్నారు.. చివరికి జిల్లా పార్టీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ చేశారు.. రేపో మాపో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, మంత్రులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.. ఇదింతా ఎందుకు..? అసలు ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో అన్నట్లుగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు.. సెప్టెంబర్ రెండవ వారం వరకు నిశబ్ధంగా ఉన్న సీఎం కేసీఆర్ ఉన్నట్లుగానే వేగంపెంచారు. చకచక రాజకీయ పాలనపరమైన అడుగులేస్తున్నారు.. జాతీయ రాజకీయాల వైపు అంటూనే రాష్ట్రంలో పరిస్థితులను చక్కబెడుతున్నారు..కానీ మొత్తానికి రాష్ట్రం దాటి పోవడం లేదు..

ఇది కూడా చదవండి: ఏయ్ కందాళ.. కళ్లు విప్పి చూడు : రేణుక చౌదరి

అకస్మీకంగా పర్యటనలు చేస్తున్నారు.. ఎవరు ఊహించని విధంగా యాద్రాద్రి పర్యటన.. ఆ తరువాత వరంగల్ పర్యటన.. వెను వెంటనే 33 మంది జిల్లాల అధ్యక్షులతో సమావేశం.. ఏదో జరుగుతోంది.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎవరికి అందని వ్యూహాత్మకమైన అడుగులు వేస్తున్నారు.. ఏంటది..? విజయం పత్రిక అందించే అద్భుతమైన రాజకీయ విశ్లేషణాత్మక కథనం తప్పకుండా చదవండి..

సీఎం కేసీఆర్ మూడవ సారి అధికారంలోకి వచ్చేందుకు వ్యహాత్మక అడుగులు వేస్తున్నారా..? జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ అంత కంటే ముందుగానే రాష్ట్రాన్ని చక్కబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా..? తెలంగాణ సంగతేంటో చూసి, ఆ తరువాత జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని యోచన చేస్తున్నారా..?ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పుంజుకోకముందే ఊపిరాడకుండా చేయాలని సీఎం కేసీఆర్ యోచినస్తున్నారా..? ఆ పార్టీలకు ఇప్పుడే చెక్ పెట్టాలని నిర్ణయించారా..? అందులో భాగంగానే వేగంగా అడుగులేస్తున్నారా..? నిజమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. దేశవ్యాప్తంగా దూసుకపోతున్న బీజేపీ పార్టీకి మరో ఏడాది సమయం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో పుంజుకుంటున్నట్లు కనిపిస్తుండటంతో పాటు, కాంగ్రెస్ పార్టీ మరింతగా పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్న సీఎం కేసీఆర్ అద్భుతమైన, అవాక్కైయ్యే ప్రకటన చేసే అవకాశం కచ్చితంగా ఉందనే అనిపిస్తోంది. ఏం చేస్తారో..ఏం చేస్తున్నారో.. చూద్దాం..

ఇది కూడా చదవండి: మహాత్ముడిని కొనియాడిన మంత్రి పువ్వాడ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2014లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన విజయం సాధించింది. ఆ తరువాత 2018లో ఎవరు ఊహించని విధంగా ఎనిమిది నెలల ముందుగానే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి అద్భతమైన విజయం సాధించారు. ఒక ఖమ్మం జిల్లా మినహా అన్ని జిల్లాలో అద్భుతమైన మెజారిటీ సాధించారు. ఆ తరువాత ఖమ్మం జిల్లాను కూడా వశం చేసుకుని రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా క్లోజ్ చేశామని అనుకుంటున్న తరుణంలో సందులో సడేమియా అన్నట్లుగా బీజేపీ దూసుకొచ్చింది. నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడంతో పాటు రెండు ఉపఎన్నికల్లో అధికార పార్టీపై విజయం సాధించింది. అంతే కాదు అత్యంత కీలకమైన హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో డూ ఆర్ డై అనే విధంగా బీజేపీ ఎదిగింది. చచ్చిబతికినట్లు టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం సపోర్ట్ తో మెయర్ ను దక్కించుకుంది. అయినప్పటికి ఏదో లోపం కనిపించింది. అంతటి ఆగని బీజేపీ మునుగోడు ఎమ్మెల్యేను గుంజుకోవడమే కాంకుడా అక్కడ ఉప ఎన్నికను తీసుకొచ్చి గెలిచి బీజేపీ ప్రత్యామ్నయం అనే విధంగా క్రియెట్ చేస్తోంది. పైగా తెలంగాణ అన్ని జిల్లాలో కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు పర్యటన చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి సవాల్ చేస్తున్నారు.  దీంతో బీజేపీ పార్టీ సీఎం కేసీఆర్ కు తలగొరిగే పరిస్థితి తీసుకొచ్చింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తన ఆలోచనలకు పదునుపెట్టారు. బీజేపీ వేగానికి బ్రేక్ లు వేయాలని రాజకీయ వ్యూహాత్మకంగా ఆలోచించిన సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

== అసలు సమస్య కాంగ్రెస్ తోనే

ఒక వైపు బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నప్పటికి సీఎం కేసీఆర్ కు అసలు సమస్య కాంగ్రెస్ మాత్రమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో 30శాతం ఓటింగ్ ఉన్న కాంగ్రెస్ పార్టీని అంతం చేయడం అంత ఈజీ కాదు.. ఏ క్షణాల్లోనైనా ఎగిసిపడే అవకాశం ఉంది. దీంతో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే పుంజుకోకుండా చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేస్తున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ అసలు మాకు పోటే కాదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అది ఒక వ్యూహమైనప్పటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క నాయకత్వంలో చాపకింద నీరులా వెళ్తుందనే విషయం సీఎం కేసీఆర్ గ్రహించారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని భావించారు. ఇలాగే వదిలేస్త మనకిందకు కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉందని భావించిన సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

== జాతీయ రాజకీయాలకు ఇంకా సమయం ఉందని..?

జాతీయ రాజకీయాల వైపు అడుగులేస్తున్న సీఎం కేసీఆర్, చాలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వర్గపోరుతో సతమతమవుతున్న తరుణంలో ఇదే అదునుగా భావించిన సీఎం కేసీఆర్ మోడీని గట్టిగ ఎదుర్కుంటే బీజేపీ రహిత పార్టీలు, సీఎంలు తనకు మద్దతు ప్రకటిస్తారని భావించారు. దీంతో సీఎం కేసీఆర్ సందు దొరికినప్పుడల్లాల ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ పాలనపై దుమ్మెత్తిపోసే పనిలో నిమగ్నమైయ్యారు. పది రోజులకో ప్రెస్ మీట్, నెలకో ప్రకటన చేస్తూ బీజేపీని జాతీయ స్థాయిలో ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా అదర్శంగానిలిచిన మిషన్ భగీరథ పథకం, దళితబంధు, రైతుబంధు, రైతు బీమా పథకాలను దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయలేకపోయరని ప్రశ్నస్తూ ఆయన పథకాలను చెప్పకనే దేశ ప్రజలకు చెప్పుకోస్తున్నారు. దీంతో బీజేపీ పై మండిపడుతున్న సీఎం కేసీఆర్ ను చూసిన బీజేపీ రహిత పార్టీలు, సీఎంలు తెలంగాణ ముఖ్యమంత్రి స్పీచ్ కు పిధా అయిపోయారు. తుర్రుమంటూ తెలంగాణకు రావడం, సీఎం కేసీఆర్ ఆ రాష్ట్రాలకు వెళ్లి ప్రత్యామ్నయ రాజకీయాలు, థర్డ్ ప్రంట్ రాజకీయాలపై చర్చించారు. అయితే కొంత మంది మద్దతు చెప్పడంతో పాటు కాంగ్రెస్ తో కలిసి పోవడమే మంచిదనే ఆలోచనను సీఎం కేసీఆర్ కు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ బహిరంగంగానే దేశంలో థర్డ ప్రంట్ లేదు, కాంగ్రెస్ తో కలిసి రెండవ ప్రంట్ మాత్రమే ఉంటుందన్నారు. దీంతో సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నంపై పెద్ద బండరాయి పడినట్లైంది. దీంతో రాజకీయ మేథస్సుకు పదును పెట్టిన సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అది ఏంటంటే..?

== అతి త్వరలో ప్రభుత్వం రద్దు…?

పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 20నెలల సమయం ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 14 నెలల మాత్రమే సమయం ఉంది. అందులో 6 నెలల ముందుగానే రాజకీయ యుద్దంలోకి దిగాలి. అయితే ఇంకా 8 నెలల సమయంలో ఏదైనా చేయోచ్చని భావించిన సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాత్మక ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెలలో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే కచ్చితంగా 2023 జనవరి లేదంటే పిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ తరువాత జాతీయ ఎన్నికలకు కచ్చితంగా ఏడాది సమయం ఉంటుంది. ఆ ఏడాదిలో ఏదైనా చేయోచ్చు. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలను ముగించుకుని  మూడవ సారి హ్యాట్రిక్ సీఎంగా జాతీయ రాజకీయాలకు వెళ్తే దేశంలోని ఇతర పార్టీలు, ప్రజలు గౌరవిస్తారని సీఎం కేసీఆర్ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీప్రధాన నాయకత్వాన్ని దేశం మొత్తం తిప్పే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అంతే కాకుండా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు తీసుకొస్తే బీజేపీ, కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉండదని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. అతి కొద్ది రోజుల్లోనే రాహుల్ గాంధీ పాదయాత్ర ఉన్న నేపథ్యంలో ఆయన పాదయాత్రను ఎన్నికల ద్వారా హైజాక్ చేసే అవకాశం ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చానళ్లన్ని ఎన్నికల గురించి ఆలోచిస్తాయే తప్ప రాహుల్ గాంధీ పాదయాత్ర గురించి ఆలోచించే అవకాశం ఉండదనే భావనలో మాస్టర్ మైండ్ సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మూడవ సారి విజయం సాధించి నేరుగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే అక్కడ విజయం సాధించడం ఖాయమని ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా సీఎం కేసీఆర్ యోచన చేస్తున్నట్లు సమాచారం. అందుకే ఆయనకు అత్యంత ఇష్టమైన 6 సంఖ్యను చూసుకుని అక్టోబర్ ఆరు అనే పదం వస్తుండటంతో పండితులు చెప్పిన ఆలోచన మేరకు సీఎం కేసీఆర్ అక్టోబర్ 6న బాంబు పెల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా వద్దనుకుంటే కచ్చితంగా ఇదే జరిగే అవకాశం.. ఏం జరుగుతుందో..రేపటి కథనంతో రాజకీయ విశ్లేషణాత్మక కథనాన్ని అందిస్తాము.. తప్పక విజయం పత్రిక, విజయం టీవీని అధరించండి… హక్కున చేర్చుకుంటారని, విజయం టీవీ ని సబ్ స్క్రైబ్ చేసుకుంటారని, ఆశీర్వదిస్తారని మనస్త్పూర్తిగా కోరుతున్నాం.