Telugu News

టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు..

◆ 200 మంది యువ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

0

టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు..

◆ 200 మంది యువ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

◆ 70 మంది మున్సిపల్ కార్మికులు..

◆ తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి పువ్వాడ.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఖమ్మం నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ కుమార్ గారు చేస్తున్న అభివృద్ధి నీ స్వాగతిస్తూ భారీగా యువత టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అందులో భాగంగా యువ తెలంగాణ జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ తో పాటు యువ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆపార్టీకి రాజీనామా చేసి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారికి మంత్రి పువ్వాడ తెరాస పార్టీ కండువా కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. వారితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు మరియు జవాన్ లు టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

also read :-పంజాబ్ లో ఈడీ సోదాల కలకలం

ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మాట్లాడుతూ…

మతతత్వ విద్వేషాలు రెచ్చగొడుతూ దేశ ప్రగతిని, రాష్ట్ర ప్రగతిని నిర్వీర్యం చేసేందుకు నిత్యం కుట్రలు చేసే బిజెపి పార్టీలో యువ తెలంగాణ పార్టీ విలీనాన్ని వ్యతిరేకిస్తూ నేడు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి సోదరుడికి అండగా ఉంటానని, రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, జిల్లాలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ కార్యకర్తగా ప్రతి గడపగడపకు చేర్చేందుకు కంకణబద్ధులై పనిచేయాలని వారిని కోరారు.