షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్
== షర్మిల బస్సుకు నిప్పుపెట్టే ప్రయత్నం
== ప్లెక్సిలను దగ్ధం చేసిన టీఆర్ఎస్ నాయకులు
== షర్మిలను అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్
(నర్సంపేట-విజయంన్యూస్)
షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.. షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లెక్సీలు టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు.షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గం, చెన్నారావుపేట మండలం జల్లి గ్రామంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు.
ఇది కూడా చదవండి: పాఠశాలల్లో సీసీ కెమెరాలు పెట్టాల్సిందే..? మంత్రి సబితారెడ్డి
షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ నిరసనకారులు నిప్పు పెట్టారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లెక్సీలు టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. గోబ్యాక్ షర్మిల అని నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఆదివారం జరిగిన నర్సంపేట సభలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలకు గానూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ ఘటనకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో ఎంపీపీ విజేందర్, సర్పంచ్ కుమార స్వామి, నాయకులు చెన్నారెడ్డి ఉన్నారు. వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలంలో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. షర్మిల బస చేసే ఏసీ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన డ్రైవర్ వెంటనే మంటలను ఆర్పేశాడు. అయితే బస్సులో ఉన్న సిబ్బంది మంటలను గమనించి బయటకు పరుగులు పెట్టారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. షర్మిల పాదయాత్రలో ఈ ఘటనతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన పట్ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు దుండగులను గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.