Telugu News

ఖమ్మంలో టీఆర్ఎస్ ధర్నా..హాజరైనా మంత్రి, ఎంపీ, మాజీ ఎంపీ.

తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వంకొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ...

0

ఖమ్మంలో టీఆర్ఎస్ ధర్నా..హాజరైనా మంత్రి, ఎంపీ, మాజీ ఎంపీ.

– కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ TRS రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఖమ్మం నియోజకవర్గ కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):-

ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శన.. నినాదాలతో హోరెత్తిన ధర్నా ప్రాంగణం..

ధర్నా ప్రాంగణానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఎడ్ల బండిపై వచ్చారు.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరి పనలతో నినాదాలు చేశారు..

కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న గారు, సూడా చైర్మన్ విజయ్ గారు, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, రైతులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు..

ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..

కళ్లుండి చూడలేని.. చెవులు ఉంది వినలేని బిజెపి ప్రభుత్వం కు రైతుల ఉసురు తగలకపోదన్నారు.

తెలంగాణలో ఏ పొలాల్లో పల్లెరు కాయలు కూడా మొలవదని అన్న భూముల్లో రెండు పంటలు పండుతున్నాయి అంటే అది తెరాస ప్రభుత్వ సూపరిపాలనకు నిదర్శనమన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 20వేలకు పై చిలుకు చెరువులను మిషన్ కాకతీయ పథకం ద్వారా పునరుద్ధరించి ప్రతి గ్రామాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందేలా చర్యలు చేపట్టారన్నారు.

ఇనుకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరిగి జల సంరక్షణ కార్యాచరణ చేసింది తెరాస ప్రభుత్వం అన్నారు.

తెలంగాణ కు ఒక న్యాయం … పంజాబ్ కు ఒక న్యాయమా..? తెలంగాణ భారతదేశంలో భాగం కాదా…? అని ప్రశ్నించారు.

తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదని, తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే FCI ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రైతుల పై కేంద్రంలోని
BJP ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు..?

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని లేకుంటే మీకు పుట్టగతులు ఉండవన్నారు.

తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా … ? కొనదా…? స్పష్టం చేయాలన్నారు.. !

రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయమంటే.. కార్లు ఎక్కించి చంపుతారా…? ఇది ఎక్కడి న్యాయం..? అని వ్యాఖ్యానించారు.

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.. అది మి విధి అని గుర్తుంచుకోవాలన్నారు.

రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదామని, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు తిప్పి కొడదామన్నారు.

కేంద్ర ప్రభుత్వామా కళ్ళు తెరువు. ఇప్పటికైనా తెలంగాణ రైతుల వరి ధాన్యం కొను అని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.

లేదంటే కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా పోరాడుతాం అని హెచ్చరించారు.

పంజాబ్ రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ..
తెలంగాణ రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనరు..కేంద్ర ప్రభుత్వమా ఇదెక్కడి న్యాయం..? రైతుల ను దగా చేస్తే సహించేది లేదన్నారు.

తెలంగాణ రైతుల ఐక్యత వర్ధిల్లాలని, కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి చరమగీతం పాడాల్సివస్తుందన్నారు.

రైతులను వంచిస్తున్న రాష్ట్ర బిజేపీ నాయకుల వైఖరిని ఎండగడదాం..!! జిల్లాలో కదలనియ్యం.. తిరగనియ్యం గుర్తుంచుకోవాలన్నారు.

BJP అంటేనే… భారతీయ ఝూటా పార్టీ..ఢిల్లీ పెద్దల్లారా ..
అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా ! వరి ధాన్యం కొనకుండా వంచిస్తారా..? అని ప్రశ్నించారు.

పైకి దేశ భక్తి..! లోపల కార్పోరేట్ భక్తి…!! BJP నేతల్లారా.. ఇదేనా మీద్వంద్వ నీతి.. ఇపుడు బయటపడింది మీ బుద్ధి అని అన్నారు.

రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, రైతులను వంచించడమే దేశ భక్తా…!
సిగ్గు..సిగ్గు .!

రాష్ట్ర BJP నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనిపించాలి అని సవాల్ విసిరారు..

also read :- గంజాయి సేవించేందుకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.