Telugu News

కాంగ్రెస్ ను విమర్శించే అర్హత టీఆర్ఎస్ కు లేదు

డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

0

కాంగ్రెస్ ను విమర్శించే అర్హత టీఆర్ఎస్ కు లేదు: పువ్వాళ్ళ

== డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

(ఖమ్మం -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ.. డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల కో.ఆర్డినేటర్,రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఓట్లు అభ్యర్థించారు. సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మట్ట రాగమయి అధ్యక్షతన కల్లూరు మండలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో పాల్గొన్నారు.. అనంతరం వారు మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, బీజేపీ పాలకులు చేసిందేమీ లేదని విమర్శించారు. కొత్తగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని తెలిపారు. పట్టభద్రులు, ప్రజల పక్షాన చట్ట సభలో గొంతుక వినిపించేందుకు తీన్మార్ మల్లన్న కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ,సీపీఐ,సీపీఎం నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…