Telugu News

ఆ ఇద్దరికి చెక్ పెట్టేందుకేనా..?

ఖమ్మం జిల్లాకే రెండు రాజ్యసభ స్థానాలేందుకు..?

0

గులాబీ వనంలో గుబులు

== ఆ ఇద్దరికి చెక్ పెట్టేందుకేనా..?

== ఖమ్మం జిల్లాకే రెండు రాజ్యసభ స్థానాలేందుకు..?

== వారి సమర్థతకు వీరే కరెక్ట్ అని భావించారా..?

== కాకాపట్టేందుకే మంత్రి కేటీఆర్ వారింటికి వెళ్లారా..?

== ఆయోమయంలో గులాబీ శ్రేణులు

== ఖమ్మం జిల్లా గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది..?

గులాబీ బాస్ ను ఆ ఇద్దరు నేతలు దిక్కరిస్తున్నారా..? బలం ఉందని స్వంతంగా వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? బాస్ గీచిన గీతను దాటి స్వంత ప్రయత్నాలు చేస్తున్నారా..? పార్టీకి నష్టం జరిగే పనులు చేస్తున్నారాని బాస్ నమ్మారా..? అవసరమైతే పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారనే అనుమానం బాస్ కి కల్గిందా..? గులాబీ బాస్ కు చెక్ పెట్టాలనే ప్రయత్నంలో వారు నిమగ్నమైయ్యారా..? అందుకే గులాబీ బాస్ వారికి చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా..? అందులో భాగంగానే వారికి తగిన సమర్థులను జిల్లా నుంచి రాజ్యసభకు ఎంపిక చేశారా..? ఎమ్మెల్సీ ఎంపిక విషయంలో కూడా అదే జరిగిందా..? ఆ ఇద్దరి విషయంలో సీఎం కేసీఆర్ అంటిముట్టనట్లుగానే వ్యవహరిస్తుంటే, మంత్రి కేటీఆర్ మాత్రం కాకాపట్టే ప్రయత్నం చేస్తున్నారా..? నిజమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లానే రాజకీయంగా శాసిస్తున్న ఆ ఇద్దరు నేతలకు గులాబీ బాస్ చెక్ పెడుతున్నట్లే కనిపిస్తోంది..? ఆయన గీచిన గీతను వారు దాటుతున్నందువల్లనే, చెప్పిన మాట వినకుండా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారనే ఆరోపణలు, పార్టీకి డ్యామేజి చేసే పనులు చేస్తున్నారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. అంతేకాకుండా ఉమ్మడి జిల్లా పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారా..?అనే ఆరోపణలతో పార్టీ నేతలు వరస ఫిర్యాదుల ఫలితంగా ఆ ఇద్దరు నేతలకు చెక్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఉమ్మడి ఖమ్మంజిల్లానే రాజకీయంగా చాసిస్తున్న ఆ ఇద్దరు నేతల పరిస్థితి ఏంటి..? కేటీఆర్ వారిని ఎందుకు కలిశారు..? సీఎం  కేసీఆర్ ఆ ఇద్దరు నేతలకు రాజ్యసభ ఎందుకు ఇచ్చారు..? ఇవ్వన్ని తెలుసుకోవాలంటే ‘విజయం’ అందించే ఈ కథనాన్ని మొత్తం చదవాల్సిందే..?    allso read- బుల్లెట్ పై గల్లిగల్లి తిరుగిన మంత్రి పువ్వాడ

ఖమ్మం ప్రతినిధి, జూన్ 17(విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీ వనంలో గుబులు మొదలైంది.. జిల్లాలో అగ్రనాయకత్వం ఉన్నప్పటికి వారిని కాదని ఎవరు ఊహించని విధంగా వేరే వారికి పదవులను ఇవ్వడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది.. మీరు మా పార్టీకి కావాలి, మిమ్మల్ని వదులుకునేదే లేదంటూనే వారికి సంబంధం లేకుండా జిల్లాకు చెందిన  ఇతర నేతలకు పదవులు వస్తుండటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అధినేతను మించిపోతున్నారనే ప్రచారం ఊపందుకోవడమో..? అధినేత మాట వినడం లేదనో..? బాస్ మాట జవదాటి జిల్లాలో పర్యటిస్తున్నారనో..? లేదంటే పార్టీ మారే అవకాశం ఉందని భావించడమా..? ఏమో కానీ వారికి ప్రతి సారి నిరాశే ఎదురవుతోంది..? అంతేకాకుండా వారికి సమర్థులైన నేతలకు పదవులు ఇవ్వడం ఫలితంగా చెక్ పెట్టే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారా..? అనే మాట సర్వత్ర వినిపిస్తోంది. గులాబీ బాస్ మాటే శాసనం అన్నవారికి తప్ప, మిగిలిన అగ్రనాయకత్వానికి నిత్యం అవమానాలే జరుగుతున్నాయి.. ఎమ్మెల్యేల నుంచి జిల్లా పార్టీ బాస్ లవరకు ఆ ఇద్దరు నేతలను, వారి అనుచరగణాన్ని దూరంగానే ఉంచుతున్నట్లు కనిపిస్తోంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే

 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో  బలంగా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం చాలా తక్కువగా ఉంది. కనీసం సర్పంచులకు పోటీ చేసే వారు కరువైయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం మినహా టిక్కెట్లకు పోటీ చేసేవారే కరువైయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన ఫలితాలు వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం కొత్తగూడెం ఒక్కటే టీఆర్ఎస్ గెలిచింది. ఆ తరువాత తుమ్మల నాగేశ్వరరావు, వారి టీమ్ మొత్తం టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ తరువాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ బలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా పుంజుకుంది. దీంతో తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆ తరువాత వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఒక పక్క మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు, మరో పక్క ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీని ముందుండి నడిపించారు. అయితే పార్టీ పూర్తి స్థాయిలో బలం పుంజుకున్నప్పటికి నేతలు అధికమై వర్గపోరుకు దారితీసింది. కాగా అంతలోనే ముందస్తు ఎన్నికలు రావడంతో పది స్థానాలకు ఒక్క స్థానం గెలవడం జరిగింది. మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావ్, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు లాంటి వారు ఓటమి చెందారు. ఈ సీట్లన్ని ఓడిపోవడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణం అని ఆనాడు నేతలందరు అధినేతకు ఫిర్యాదు చేశారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపినట్లు ప్రచారం జరిగింది. దీంతో పొంగులేటి కొద్ది నెలల పాటు ఆ నింద మోయాల్సి వచ్చింది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు రాగా ఆ ఎన్నికల్లో అన్నిపార్టీల వారికి డబ్బులు పంపిణి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ విషయం సీఎం కేసీఆర్ కు అగ్రనేతలు నేరుగా ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ పొంగులేటిని మందలించినట్లు కూడా వార్తలు వచ్చాయి.  కాగా 2019లో పార్లమెంట్ ఎన్నికలు రాగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటిని కాదని టీడీపీ నుంచి నామాను పార్టీలో చేర్చుకుని ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. ఈ ఎన్నికల్లో పొంగులేటి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని అనుకున్నప్పటికి ఆ సాహసం చేయలేదు. కానీ అంటిముట్టనట్లుగా వ్యవహిరించి ప్రచారంలో పాల్గొన్నారు. అయితే పువ్వాడకు మంత్రి పదవి రావడం, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం, వారికే పూర్తి బాధ్యతలు ఇవ్వడంతో ఓటమి చెందిన పొంగులేటి,వారి అనుచర ఎమ్మెల్యేలు పరిస్థితి అగమ్యగోచరమైంది. దీంతో కాలక్రమేనా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వైరం పెరిగింది. అంతే కాకుండా ఎమ్మెల్సీ విషయంలో కూడా ఆ ఇద్దరికి అవకాశాలు ఇవ్వకపోవడం, తిరిగి రాజ్యసభ ఎన్నికల్లో సీటు దక్కక పోవడం పట్ల ఆ ఇద్దరు నేతలు కొంత గుర్రుగానే ఉన్నారు. ప్రత్యామ్నయం లేక ఆపార్టీలో అలాగే ఉండిపోయినట్లు ప్రచారం జరిగింది.

== మూడు సార్లు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉన్నా..?  alls0 read- పాలేరు నుంచే షర్మిల పోటీ

రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి.. 2018 ఎన్నికలు జరిగిన కొద్ది రోజులకే పార్లమెంట్ ఎన్నికల అనంతరం మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి, అలాగే ఏడాది తరువాత రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, రెండేళ్ల తరువాత ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అలాగే రాజ్యసభ సభ్యులకు కూడా రెండు దఫాలుగా ఎన్నుకున్నారు. ఆ పదవులకు నోటిఫికేషన్ వచ్చిన ప్రతి సారి ఈ ఇద్దరు నేతల పేర్లు వినిపించేవి. కానీ ఆ తరువాత సీఎం కేసీఆర్ వీరిద్దరిని కాదని వేరేవారికి అవకాశం కల్పించారు. మొన్న రాజ్యసభ ఎన్నికల్లో కూడా ఈ సారి పొంగులేటికి, లేదంటే తుమ్మల నాగేశ్వరరావుకు రాజ్యసభ ఖాయమని భావించారు. కానీ అది జరగకుండా అందరు అశ్ఛర్యపడేవిధంగా సీఎం కేసీఆర్ టిక్కెట్లు కేటాయించారు..

== ఈ ఇద్దరికి చెక్ పెట్టేందుకేనా..?      allso read-  కాంగ్రెస్ తోనే రైతు రాజ్యం తథ్యం: భట్టి విక్రమార్క

రాజ్యసభ సభ్యుడిగా తుమ్మల నాగేశ్వరరావు, లేదంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్ దక్కే అవకాశం ఉందని భావించినప్పటికి సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు బడా కాంట్రాక్టర్లకు రాజ్యసభ సీట్లు కేటాయించారు. వరంగల్ వాసి అయినప్పటికి ఖమ్మం జిల్లాలోనే రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టిన గాయత్రి రవి, సత్తుపల్లి నియోజకవర్గ వాసి అయిన బండా పార్థసారథిరెడ్డికి టిక్కెట్ కేటాయించారు. అయితే ఇందులో కచ్చితంగా సీఎం కేసీఆర్ అద్బుతమైన స్కెచ్ ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు సీఎం కేసీఆర్ మాట వినేటట్లుగా లేరని, అవకాశం వస్తే పార్టీ మారి టీఆర్ఎస్ ను ఓడించేందుకు వెనకాడరనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా మొదటి నుంచి పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుండటం, ఆయా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను కాదని స్వంతంగా పార్టీ జెండా లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం, కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్ లోకి వెళ్లడం లాంటి పనులు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వద్ద పక్కా రిపోర్టు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఆ ఇద్దరు నేతలు జిల్లాను శాసించే స్థాయి ఉండటం, పీకే సర్వే కూడా ఆ ఇద్దరు నేతలకు అనుకూలంగా సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. అయితే వీరిని పార్టీలో ఎక్కడో ఒక దగ్గర అడ్జెస్ట్ చేయాలనుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థానం లేకుండా పోతుంది. వారికి పార్టీ మారే ముందే టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అందుకే అటు ఇటుగా మారితే వారిద్దరు పార్టీ మారడంతో పాటు పార్టీలో ఉన్నవారందర్ని బయటకు తీసుకెళ్లే అవకాశం ఉంది. పార్టీ పూర్తి స్థాయిలో డ్యామెజ్ అయ్యే అవకాశం లేకపోలేదని భావించిన సీఎం కేసీఆర్, వారిద్దరికి చెక్ పెట్టే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే దేశంలోనే అత్యధికంగా అర్థిక వనరులున్న బండి పార్థసారథిరెడ్డిని రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఇద్దరు అగ్రసామాజిక వర్గానికి చెందిన వారు కావడం, ధనబలం, కులబలం, జనబలం ఉండటంతో వారికి చాటిగా ఉండే పార్థసారథిరెడ్డి అయితే కరెక్ట్ అని భావించినట్లు సమాచారం. అంతేకాకుండా వారిద్దరు సత్తుపల్లి నియోజకవర్గ వాసులు కావడంతో పార్థ సారథిరెడ్డి కూడా  సత్తుపల్లి నివాసి కావడంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వీరు పార్టీని వీడిన పార్థ సారథిరెడ్డి పార్టీని కాపాడే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ ప్రగాడ నమ్మకం. అలాగే గాయత్రి రవి విషయంలో కూడా ఈ స్టాటజీతోనే ఆయనకు టిక్కెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గాయత్రి రవి కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, గ్రానైట్ అసోసియోషన్ నాయకుడు, దేశవ్యాప్తంగా పరిచయాలు, ఉమ్మడి జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లో మెలిగిన వ్యక్తి కావడం ఫలితంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సమతూకం కల్గిన వ్యక్తి అని భావించి టిక్కెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకానోక సందర్భంలో ఈ ఇద్దరు పార్టీని వీడిన ఆ ఇద్దరు అర్థికంగా, సామాజికంగా పార్టీని లాక్కోని వస్తారనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ అద్భుతమైన స్టాటజీతో రాజ్యసభ సీటు వారికి కేటాయించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

== కేటీఆర్ మరో స్టాటజీ ప్రయోగం..?

రాజ్యసభ విషయంలో ముఖం చాటేసిన తుమ్మల, పొంగులేటిని మంత్రి కేటీఆర్ కాకపట్టే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ ఎన్నడు లేని విధంగా నేరుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసినికి వెళ్లి బ్రేక్ పాస్ట్ చేయడం, వారికి రాజకీయ భవిష్యత్ పై భరోసా ఇవ్వడం లాంటి ప్రయోగాత్మక పనులు చేసినట్లు కనిపిస్తోంది. రాజకీయంగా పార్టీకి ఎక్కడ ఇబ్బంది కల్గకుండా మంత్రి కేటీఆర్ చాలా జాగ్రత్తగా వారిద్దరిని కాకపట్టే ప్రయత్నం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అవతల ఓడ్డు.. లేకపోతే ఇవతల ఓడ్డు అన్నట్లుగా ఉన్న ఆ ఇద్దరు నేతలను సమన్వయం చేసిన విషయంలో మంత్రి కేటీఆర్ సక్సెస్ అయ్యాడనే భావించాలి. అయితే మంత్రి కేటీఆర్ ఇచ్చిన భరోసా విషయంలో కొన్ని అనుమానాలు లేకపోలేదు. సీఎం కేసీఆర్ స్టాటజీలో ఈ ఇద్దరికి స్థానమే లేకపోగా, మంత్రి కేటీఆర్ ప్లాన్ లో ఆ ఇద్దరు నేతలకు భరోసా కల్పించడంలో అంతర్యముందని రాజకీయ సమర్థులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఖమ్మం జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఉన్న పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థికంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? మంత్రి కేటీఆర్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..? ఈ ఇద్దరికి గులాబీ టిక్కెట్ దక్కుతుందా..? వేచి చూడాల్సిందే..మరీ..?