Telugu News

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య..ఎందుకోసమంటే..?

ఖమ్మం రూరల్ తెల్ధారుపల్లిలో సంఘటన  

0

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య.

== ఖమ్మం రూరల్ తెల్ధారుపల్లిలో సంఘటన  

== రాజకీయ నేపథ్యంలో హత్య జరిగినట్లు అనుమానం

ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 15(విజయంన్యూస్)

టీఆర్ఎస్ నేత, తుమ్మల వర్గీయులు తమ్మినేని  కృష్ణయ్య హత్యచేయబడ్డాడు. కొంత మంది దుండగులు అతి కీరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.. ఈ సంఘటన ఆయన స్వగ్రామమైన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పాత కక్ష్యలు, రాజకీయ నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పలువురు భావిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం రూరల్ మండలంలోని తెల్ధారుపల్లి గ్రామానికి చెందిన తమ్మినేని కృష్ణయ్య స్వయాన సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కజిన్ బ్రధర్.. ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు. తెల్దారుపల్లిలో టీఆర్ఎస్ పార్టీ విజయం కోసం ఆయన ఎంతగానో కష్టపడిపనిచేసిన పరిస్థితి ఉంది. అయితే గత 30ఏళ్ల నుంచి ఆగ్రామంలో రాజకీయ కక్ష్యలు ఉన్నాయి. దీంతో తెల్దారుపల్లి-మద్దులపల్లి సమీపంలోని దోబీగాట్ వద్ద  గుర్తు తెలియని దుండగులు అతికీరాతకంగా హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు.  అదును చూసి కత్తులు, గొడ్డళ్లతో హత్యచేశారు.  విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు నిర్వహిస్తున్నారు.

ఇది కూడ చదవండి: మునుగోడు కు సీఎం కేసీఆర్… ఎప్పుడంటే..?