Telugu News

’ఆ నలుగురు‘ చుట్టే రాజకీయం.. ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హిట్

0

ఆ నలుగురు‘ చుట్టే రాజకీయం
== ఉమ్మడి జిల్లాలో పొలిటికల్ హిట్
== దూకుడు పెంచిన అసమ్మతి నేతలు
== పోటీ కి సై అంటున్న తుమ్మల, పొంగులేటి, జలగం, దయానంద్
== ఇప్పటికే ఆ స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు
== కండువ మార్చే యోచనలో ‘ఆ నలుగురు’..?
ఖమ్మం జిల్లాను శాసించే స్థాయి కల్గిన నాయకులు వారు.. కనుసైగలతో పరిపాలన చేసే అంతటి దమ్మున్న నేతలు.. వారు బయటకు వస్తే కార్యకర్తలకు పండుగే.. వారు ప్రజా పాలకులు.. ప్రజల కోసం పనిచేసే మనుసున్నవారు.. నిత్యం ప్రజల గురించి, పల్లెలాభివద్ది గురించి ఆలోచించే వారే.. అలాంటి నాయకులు గత కొద్ది నెలలుగా అధికార పార్టీ నేతల నుంచి అవమానాలను ఎదుర్కోంటున్నారు.. వారే కాదు వారి అనుచరులది అదే పరిస్థితి.. ప్రస్తుతం సిట్టింగ్ లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీల అనుచరులపై రాజకీయం చూపిస్తున్నారు.. కేసులు పెట్టించి జైలుకు పంపిస్తున్నారు.. సమావేశాలకు సమాచారం ఇవ్వకుండా నిత్యం అవమానాలకు గురి చేస్తున్నారు.. ఈ తరుణంలో ఆ నాయకులు బయటకు వచ్చారు.. మా సత్తా ఏంటో చూపిస్తామంటూ సవాల్ చేస్తున్నారుపోటీ చేసుడు పక్కా అంటూ బహిరంగంగానే చెబుతున్నారు.. .. గ్రామాల్లో పర్యటిస్తున్నారు.. ప్రజలను, అభిమానులను, అనుచరులను ఐక్యం చేసే పనిలో పడ్డారు.. అసలు ఎవరు వారు..? ఎందుకు పోటీ చేస్తామంటున్నారు..? ఎవర్ని కలుస్తున్నారో వివరాలు కావాలంటే ‘విజయం’ పత్రిక ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం చదవాల్సిందే..?

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం జిల్లాలో తన మార్కు రాజకీయాన్ని రంగరించి మరీ అధిష్టానానికి రుచి చూపిస్తున్నారు ‘ఆ నలుగురు’ నేతలు. ఇప్పటి వరకు పార్టీలో ఎన్నో అవమానాలు జరిగిన నిశబ్ధంగా ఉన్నప్పటికి గత నెల రోజుల నుంచి వారు తన రాజకీయ మార్క్ ను చూపిస్తున్నారు. దూకుడు పెంచారు.. ప్రజలను కలుస్తున్నారు.. కార్యకర్తలకు భరోసానిస్తున్నారు.. అనుచరులకు కష్టమొస్తే వాలిపోతున్నారు.. పేదలను అదుకుంటున్నారు.. అర్థిక చేయూతనందిస్తున్నారు.. అవసరమైతే పోటీకి సై అంటూ ప్రకటనలు చేస్తున్నారు.. ఫలితంగా ఉమ్మడి ఖమ్మంలో పొలిటికల్ హిట్ పెరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వారే ‘ఆ నలుగురు’. టీఆర్ఎస్ పార్టీకి ఒక వైపే చెమటలు పట్టిస్తున్న ఆ నలుగురు.. రాబోయే ఎన్నికల భవిష్యత్ ను మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు..

ఎన్నికలకు మరో సుమారు రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఇప్పుడే ఎన్నికల వేడి ప్రారంభం అయింది. కారణం ఏదైనా తన ఉనికి ముఖ్యం అనుకొనే నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజల్లో ఉన్న పట్టుతో బెట్టుగా, టి.ఆర్.ఎస్ అదిష్టానంపై గుర్రుగా ఉన్నవారు అంతరంగం వేరు….?! రాష్ట్రంలో తన పట్టుకోసం కలకూర గంపగా, కప్పగంతుల రాజకీయం ఖమ్మంలో నడిపిన కేసీఆర్ అందరిని టి.ఆర్.ఎస్ లో చేర్చుకోవడంతో రాజకీయ పరిస్థితులే మారిపోయాయి.. రాజకీయ పదవులు, ప్రజాప్రతినిధులుగా చేసే నామినేటేడ్ పోస్టులకు కూడా వారు టీఆర్ఎస్ కు అవసరమని భావించలేకపోయారు.. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వడం, ఎమ్మెల్సీ విషయంలో అవకాశం కల్పించకపోవడంతో తుమ్మల, పొంగులేటి నాయకత్వం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సన్నగిల్లింది. ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా పదోన్నతి పొందిన పువ్వాడ అజయ్ కుమార్ హావ్వా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఎంపీటీసీలు పువ్వాడ అజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేల పొంతన చేరారు.   allso read; రాఘవపై కుట్రలు పన్నారు : వనమా వెంకటేశ్వరరావు

దీంతో వారు ఒంటరైయ్యారని అందరు భావించారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నామా నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యేలు మరి కొందరు జిల్లా నేతలు కారణం లేని అప్రకటిత యుద్ధం చేస్తున్నారని, తన అనుచరులకు పార్టీ, నామినేటెడ్ పదవుల్లో వివక్షతను చూపిస్తున్నారని, ప్రత్యక్ష భౌతిక దాడులు చేస్తున్నారని ఇటీవల పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపిస్తునే ఉన్నారు. అయినప్పటికి అదిష్టానం పట్టించుకోలేదు. దీంతో పార్టీలో ఈ వైఖరి మింగుడు పడని తుమ్మల, పొంగులేటి ప్రజల్లో తన పరపతి పలుచని కాకముందే ముందస్తు వ్యూహాలు రెఢీ చేసుకుంటున్నారు. తన హస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.. కార్యకర్తలను, నాయకులను, అనుచరులను ఐక్యం చేసే పనిలో పడ్డారు. దెబ్బకు దెబ్బ అనే రీతిలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నేపథ్యంలో జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. టి.ఆర్.ఎస్. పార్టీకి ఇది మింగుడు పడని వ్యవహారం అయినప్పటికీ తుమ్మల, పొంగులేటిపై చర్యలకు కేసీఆర్ సిద్ధం కావడం లేదు. దీంతో పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఏర్పడింది.

== ఖమ్మం పాలిటిక్స్ లో కేసీఆర్ వ్యూహ్యమేంటి..?
సీఎం కేసీఆర్ పార్టీలో, ప్రభుత్వంలో సుప్రీం అయినప్పటికీ ఖమ్మంలో ఆయన పాలిటిక్స్ పప్పులు ఉడకడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కేసీఆర్ తన మార్కు చూపించుకున్న ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ నలుగురి మార్కె నడుస్తుందనడంలో సందేహమే లేదు. ఇదే విషయం పీకే కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది తొలుత కేసీఆర్ సైతం ఖమ్మం జిల్లాలోని రాజకీయ వాతావరణంపై “ప్రశాంత్ కిషోర్” చే పొలిటికల్ సర్వే నిర్వహించగా టి.ఆర్.ఎస్ ఖమ్మంలో ఖచ్చితంగా ఒక్క సీటు గెలిచే స్థితిలో లేదని, వీటికి టి.ఆర్.ఎస్ వర్గ, ఆధిపత్య పోరు అని తేలిపోయింది. ఈ దశలో “పొంగులేటి,” ఏకవీర పొలిటికల్ ఎపిసోడ్ రంగంలోకి రావడంతో కేసీఆర్ నాలుక కరుసుకొనే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వారిద్దరిని వారించలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికలు షేడ్యూల్ ప్రకారం జరిగిన, ముందస్తు ఎన్నికలు జరిగిన బహ బాహికి “పొంగులేటి” సిద్ధం అనే రాజకీయ సంకేతాలు ఇచ్చేందుకు ఆయన సిద్ధం అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. allso read;  పట్టాలతో పేదలకు శాశ్వత ఉపశమనం .. మంత్రి పువ్వాడ.

== దూకుడు పెంచిన జలగం.. మట్టాదయానంద్


ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మాజీలుగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తుండగా, ప్రసుత్తం వారి జాబితాలో మరో ఇద్దరు నాయకులు చేరారు. కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన జలగం వెంకట్రావ్, సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మట్టా దయానంద్ ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ పట్ల అసంత్రుప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే వనమాను టీఆర్ఎస్ లోకి తీసుకోగా, పూర్తి బాధ్యతలను ఆయనకే అప్పగించారు. అలాగే సత్తుపల్లి నుంచి సండ్ర వెంకటవీరయ్యను పార్టీలోకి తీసుకుని ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతో జలగం, మట్టాదయానంద్ ఇద్దరు ఆయా నియోజకవర్గాల్లో పరపతిని కొల్పోయే పరిస్థితికి చేరారు. దీంతో తక్షణమే మెల్కోన్న ఆ ఇద్దరు నాయకులు వారి స్వంత నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తూ దూకుడు పెంచారు. అవసరమైతే పోటీ చేసేందుకు వెనకాడేది లేదని ఆ ఇద్దరు బహిరంగంగానే ప్రచారం చేసుకుంటున్నట్లు తెలిసింది.

== పార్టీలో ఉంటారా..?
ప్రజాఅకర్షణ కల్గిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావ్ లు ప్రస్తుత రాజకీయాల్లో పెను సవాల్ గా మారారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికి అసమ్మతి నేతలుగా మిగిలిపోయారు. సత్తుపల్లిలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భావిస్తూ పోటీ చేస్తున్న మట్టా దయానంద్ కూడా అసమ్మత్తి నేతగానే మిగిలారు. పార్టీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు వచ్చే అవకాశం ఉందని అందరు భావిస్తుండటంతో ఆ నలుగురు పార్టీలో ఉంటారా..? బయటకు వెళ్తారా..? అనే సందేహాలు, ప్రశ్నలు లక్షలాధి మంది జనాన్న తట్టి లేపుతోంది. పొంగులేటి, తుమ్మల ఇప్పటికే పోటీ చేయడం ఖాయం అని ప్రకటించగా, జలగం వెంకట్రావ్, మట్టాదయానంద్ అదేబాటలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరు నలుగురు పార్టీలో ఉంటారా..? అనేది ప్రశ్నార్థికంగానే మారింది. మాములుగానే బయటకు వెళ్తారా..? కేసీఆర్ పై పరోక్ష యుద్ధం ప్రకటిస్తారా..?అనేది అర్థం కావడం లేదు. అయితే ఈ నలుగురు కాంగ్రెస్ పార్టీలో చేరి అతిపెద్ద రాజకీయ అలజడి సృష్టించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కొందరు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికి, జిల్లాలో ఆ పార్టీకి గెలుపు అసాధ్యం అని వారి అనుచరులు చూసిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇప్పుడు ముందున్నది రాజకీయ ప్రాతినిధ్య ఆధిపత్య, ప్రజా ప్రయోజన, ప్రజా పీఠాలే కనుక వారు రాజకీయానికి తగ్గట్లు లౌకిక, సాంప్రదాయ ఓటు బ్యాంకుగల కాంగ్రెస్ పార్టీ ఒక్కటే వారికి కి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. allso read ; తుమ్మలది టీఆర్ఎస్ రెబల్ కాదు..టీఆర్ఎస్సే

== సయోద్య కుదురుతుందా..?
తుమ్మల నాగేశ్వరరావు, జలగం వెంకట్రావ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు రాజకీయ ఉద్దండులే.. రాజకీయ జీవితంలో తుమ్మల నాగేశ్వరరావు సీనియర్ కావోచ్చు కానీ, ప్రజాధరణ ముగ్గురికి సమానమైన తీరు ఉంటుంది. అయితే తుమ్మల, జలగం ఇద్దరు గతంలో శత్రువులు. సత్తుపల్లి నుంచి ఇద్దరు పోటీ చేసి ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోరాడిన పరిస్థితి ఉంది.. 2018 నాటికి ముందు తుమ్మల వర్సెస్ పొంగులేటిగా మారింది. తుమ్మల నాగేశ్వరరావును పొంగులేటి ఓడించారనే ప్రచారం జరిగింది. దీంతో తుమ్మల ఎంపీకి అవకాశం లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వారు కలిసి చర్చించుకున్న దాఖలాలు లేవు. వారి వర్గీయులు కూడా అగ్గిమీద గుగ్గిలంగానే ఉన్నారు. కానీ అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు వేరు. ఓడించిన వారు ఇప్పుడు రాజుళ్లా తిరుగుతున్నారనే ప్రచారం ఉంది.అయితే ఇంతలా శత్రుత్వం ఉన్న ఈ ముగ్గురు కలుస్తారా..? అనేది ప్రశ్నార్థికమే.. కానీ వారు కలవాల్సిన అవసరం, అవస్యకత ఉందని తుమ్మల, పొంగులేటి అనుచరులు వాధిస్తున్నారు.. ఇప్పటికే తుమ్మల, పొంగులేటి కార్యక్రమాలకు ఇద్దరి వర్గీయులు కలిసి పాల్గొంటున్నారు. వారిలో సయోద్య కుదిరి ఒకే పార్టీలోకి వెళ్తే కచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మాత్రం కేసీఆర్ ను ఓడించడం ఈజీ అని, అదే బీజేపీలోకి వెళ్తే కచ్చితంగా వారు టీఆర్ఎస్ కు న్యాయం చేసిన వారవుతారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా ఆ నలుగురు నేతలు మారిపోయారు.. చూద్దాం రాబోయే రోజుల్లో ఆ నేతలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో..?