Telugu News

విజయగర్జన సభకు భారీగా తరలివెళ్ధాం : వనమా

లక్ష్మిదేవిపల్లి లో మండల సర్వ సభ్యసమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే

0

విజయగర్జన సభకు భారీగా తరలివెళ్ధాం : వనమా

— లక్ష్మిదేవిపల్లి లో మండల సర్వ సభ్యసమావేశంలో పిలుపునిచ్చిన ఎమ్మెల్యే

(భద్రాద్రి కొత్తగూడెం -విజయంన్యూస్)

వరంగల్ లో వచ్చే నెల 15 జరిగే విజయ గర్జన సభకు పదివేల మంది కార్యకర్తలతో తరలి వెళ్ళాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం టిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవి పల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేయగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు.  ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన ఎమ్మెల్యే వనమా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ లక్ష్మీదేవి పల్లి మండల, సర్వ సభ సమావేశం లో పాల్గొని, రేపు 27వ తారీకు కొత్తగూడెం క్లబ్ లో జరగబోయే నియోజకవర్గ స్థాయి సమావేశం,  వచ్చేనెల 15వ తేదీ వరంగల్ లో జరగబోయే భారీ బహిరంగ సభల గురించి కార్యచరణ పై ప్రజాప్రతినిధులు, నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఎంపిపి భూక్యా సోన, నాయకులు తూము చౌదరి, మండల అధ్యక్షులు కొట్టీ వెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, ఉర్దూ ఘర్ చైర్మన్ అన్వర్ పాషా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వజ్జ రాజు, ఎంపీటీసీలు కొల్లు పద్మ, తేజవత భద్రమ్మ, స్వాతి, మూర్తి, కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్, సర్పంచులు కోరం చంద్రశేఖర్, తాటి పద్మ, పూనం నాగేశ్వరరావు, పూనం సంధ్య, కిషన్, బలరామ్, లాలూ, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, డైరెక్టర్లు, శేషాద్రి వినోద్, రేణుక, వార్డు మెంబర్లు, గౌస్, బరపాటీ ప్రసాద్, పూనం శ్రీను, ఐకే సత్యనారాయణ, కమ్రాన్, పూర్ణ, మరియు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

also read:- కిషన్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్‌

 

‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’