Telugu News

ఆ ఒక్కటే మా లక్ష్యం : కృష్ణచైతన్య

మధిర నియోజకవర్గ యువజన కమిటీల ఏర్పాటు

0

ఆ ఒక్కటే మా లక్ష్యం 

— టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య

మధిర నియోజకవర్గ యువజన కమిటీల ఏర్పాటు

— నియమాక పత్రాలను అందించిన జడ్పీచైర్మన్, విత్తనాభివృద్ది చైర్మన్

(ఖమ్మం-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడమే మా యువజన విభాగం లక్ష్యమని టీఆర్ఎస్ యువజన విభాగంగా జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మధిర నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాలకు యువజన కమిటీలను ఏర్పాటు చేశారు. కాగా వారందరికి నియామక పత్రాలను జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు, విత్తనాభివృద్ది చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, యువజన జిల్లా అధ్యక్షుడు కృష్ణచైతన్య  అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణచైతన్య మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు  పువ్వాడ అజయ్ కుమార్  ఆదేశాల మేరకు మధిర నియోజకవర్గ ఇంచార్జి లింగాల కమల్ రాజు  సూచనలతో మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని,ముదిగొండ, బోనకల్, మధిర ఎరుపాలెం మండలాల యూత్ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నిక అయిన వారికి నియామక పత్రాలను అందజేశామని తెలిపారు.  మధిర నియోజకవర్గ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నూతనంగా ఎన్నిక అయిన అధ్యక్ష కార్యదర్శుల కు సూచించారు.

ఇది ఒపెన్ చేసి చూడగలరు : ‌- కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం కేసీఆర్