Telugu News

రోడ్డు ప్రమాద బాధితుడిని ఆదుకున్న టీ.ఆర్ఎ.స్ నేతలు.

రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్రంగా రక్త స్రావం అవుతున్న బాధితుడిని ఆదుకుని ఆస్పత్రికి తరలించారు టీఆర్ఎస్ నేతలు.

0

రోడ్డు ప్రమాద బాధితుడిని ఆదుకున్న టీ.ఆర్ఎ.స్ నేతలు.

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్) :-

నవంబర్, 26:- రోడ్డు ప్రమాదంలో గాయపడి తీవ్రంగా రక్త స్రావం అవుతున్న బాధితుడిని ఆదుకుని ఆస్పత్రికి తరలించారు టీఆర్ఎస్ నేతలు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) సత్తుపల్లి మార్గంలో వెళుతుండగా.. తల్లాడ మండల కేంద్రంలోని రింగ్ సెంటర్ లో ద్విచక్ర వాహనం అకస్మాత్తుగా అదుపుతప్పి ఓ వాహన దారుడు కింద పడి కాలికి ఫ్రాక్చర్ అయింది.

తీవ్రంగా రక్త స్రావం అవుతున్న బాధితుడిని చూసి ఎమ్మెల్సీ పల్లా, గాయత్రి రవి లు వెంటనే ఆదుకున్నారు. గాయత్రి రవి తన సొంత వాహనంలో బాధితుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.

 

also read :-కాటేసిన పాము.. పసుపు రాసి నిద్రపుచ్చిన ఆయామ్మ.