Telugu News

రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం..

నిర్ణయాలేముంటాయో..?

0

రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం..

నిర్ణయాలేముంటాయో..?

(హైదరాబాద్ – విజయం న్యూస్):-

*నవంబర్ 16 : మంగళవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది.

ప్రస్తుత పరిస్థితులు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహాణ తదితర అంశాలపై చర్చ జరగనుంది..

అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే ముఖ్యంగా తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ, తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నుల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణను టీఆర్ఎస్ఎల్పీ సమావేశం రూపొందించనున్నది.

ప్రస్తుతం వానాకాల పంట కొనుగోలుపై చర్చించనున్నారూ ముఖ్యంగా బీజేపీని టార్గెట్చేస్తూ కార్యక్రమాల నిర్వహాణపై చర్చించనున్నట్లు సమాచారం.

 

also read :- అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు.