Telugu News

పెవిలియల్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ విస్తరణకు ఎంపి నిధుల నుండి రూ.3 లక్షలు మంజూరు

టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

0

పెవిలియల్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ విస్తరణకు ఎంపి నిధుల నుండి రూ.3 లక్షలు మంజూరు

టీఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు

(విజయం న్యూస్);-

ఖమ్మం : మార్చి 3 ఖమ్మం పెవీలియన్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ విస్తరణకు ఎంపీ నిధులనుండి రూ. 3 లక్షలు మంజూరు చేసినట్టు టీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు . పెవీలియన్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ చుట్టూ పైప్ లైన్ నిర్మించడం , గ్రౌండ్ లో 3 హెచ్.పి సబ్ మెర్సిబుల్ మోటార్ ఏర్పాటు , గ్రౌండ్లోని బ్యాడ్మెంటెన్ కోర్ట్ లో ఇనుప రాడ్లతో కూడిన ఎల్ షేప్ కర్టెన్ ఏర్పాటు చేయడం , మైదానం యొక్క పశ్చిమ భాగంలో 2 అడుగుల వెడల్పుతో వాకింగ్ ట్రాక్ ను విస్తరించడం , గ్రౌండ్ వద్ద స్టేజ్ నుండి బాస్కెట్ బాల్ కోర్ట్ వరకు వాకింగ్ ట్రాక్ ను విస్తరించడం కోసం ఈ నిధులను వినియోగించనున్నారని ఎంపీ నామ వెల్లడించారు.

also read;-పేదలకు ‘పట్టా’భిషేకం..

వాకర్స్ అసోసియేషన్ విన్నపానికి తక్షణమే స్పందించిన ఎంపీ నామ

ఇటీవల టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత , ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు ఖమ్మం పర్యటనలో భాగంగా పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ , విశ్రాంతి ఉద్యోగులు ఎంపి నామ నాగేశ్వరరావును కలిసి పెవిలియన్ గ్రౌండ్ లో అవసరం ఉన్న పలు పనుల నిమిత్తం నిధులు కేటాయించాల్సిందిగా విన్నవించారు . వారి విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించిన ఎంపి నామ రూ. 3 లక్షల నిధులు కేటాయించారు . ఆయా పనులకు గురువారం ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ , స్థానిక కార్పోరేటర్లు 44 , 45 డివిజన్ల కార్పోరేటర్లు పాలెపు విజయ , బుడిగం శ్రీనివాసు, రైతు బంధు కన్వీనర్ నలమల వేంకటేశ్వర్లు చేతుల మీదుగా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపి నామకు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో వాకర్స్ కమిటీసభ్యులు దామోదర్ రెడ్డి , ముత్తయ్య , కోటయ్య , దేవులపల్లి ఏకాంబరం , గోవర్ధనరావు , సుదర్శన్ , నాగన్న , వాకర్స్ అసోసియేషన్ సభ్యులు , నామ సేవ సమితి సభ్యులు పాల్వంచ రాజేష్ , చీకటి రాంబాబు , తాళ్లురి హరీష్ , కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.