ఒక తీపి.. ఒక సేదు..
==ప్రారంభమైన ‘టీఆర్ఎస్’ చివరి సమావేశం
== సీఎం కేసీఆర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం
== హాజరైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తిరుమవలవన్
== అసక్తిగా చూస్తున్న భారతదేశం
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర సమితి చివరి సమావేశం ప్రారంభమైంది..సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహాసభ జరగనుంది. ఎంతో ప్రతిష్టాత్మంగా ఈ సమావేశం జరగనుండగా, పార్టీ నాయకత్వానికి మాత్రం ఓ చేదు..మరో తీపి వార్తను ప్రకటించే అవకాశం ఉంది.. తెలంగాణ రాష్ట్ర అవిర్భావం కోసం 2001, ఏప్రిల్ 27న కేసీఆర్ ఆధ్వర్యంలో అవిర్భావమైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరుకు 2022 విజయదశమి రోజున అధికారికంగా ముగింపు పలికే అవకాశం ఉంది..
ఇది కూడా చదవండి : అందరి చూపు మునుగోడు వైపు
21ఏళ్ల తరువాత ఆ పార్టీ పేరును పూర్తిగా తొలగించనున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ 14ఏళ్లకాలంలో ఎన్నో ఉద్యమాలను, ఎన్నో పోరాటాలను నిర్వహించింది. అధికార కాంగ్రెస్ పార్టీని ముచ్చెమటలు పోయించింది. జేఏసీతో కలిసి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎవరు ఊహించని పోరాటం చేసింది. సాగరహారం, సకలజనుల సమ్మె, అసెంబ్లీ ముట్టడి, ఛలో ఢిల్లీ లాంటి అనేక పోరాటాలు చేసింది. అతితక్కువ కాలంలోనే పార్టీ గ్రామీణ ప్రాంతాలకు చేరింది. ఉద్యమాన్ని ఆ స్థాయిలో ముందుకు తీసుకెళ్లిన టీఆర్ఎస్ పార్టీ కోసం ఎందరో నాయకులు లాఠీదెబ్బలు తిన్నారు, తూటాలకు బలైయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఎన్నో పోరాటల నేపథ్యం కల్గిన టీఆర్ఎస్ పార్టీకి దసర పర్వదినాన పుల్ స్టాఫ్ పడనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ భారతదేశ రాజకీయాలకు వెళ్లేందుకు గాను కొత్త పేరును ప్రతిపాధించి ప్రకటించనున్నారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి బదులుగా భారత్ రాష్ట్ర సమితి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అందుకు గాను మధ్యాహ్నం 1.30గంటలకు సుముహుర్తం నా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో టీఆర్ఎస్ కు ముగింపు పలకనున్నారు. అది టీఆర్ఎస్ నాయకత్వానికి కొంత నైరాసమైనప్పటికి కొత్త పేరుతో నూతన ఉత్సాహంతో ముందుకు సాగనున్నారు.
== ప్రారంభమైన సర్వసభ్య సమావేశం
తెలంగాణ భవన్ లో బుధవారం రాష్ట్ర మహాసభను సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కాగా, రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు మొత్తం 282 మంది డెలిగెట్స్ తో ఈ సమావేశం ప్రారంభమైంది. ముందుగా మంత్రుల అభిప్రాయాలు, సీనియర్ల అభిప్రాయాలను తీసుకోనున్నారు. ఆ తరువాత సీఎం కేసీఆర్ నూతన పార్టీకి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా పార్టీ నాయకులకు తెలియజేసీ, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం, మీరేం చేయాలో అనే అంశాలపై సీఎంకేసీఆర్ వివరించనున్నారు. అలాగే పార్టీ పేరు, జెండా, ఏజెండాను వివరించనున్నారు. అనంతరం నాయకత్వానికి దిశనిర్థేశం చేయనున్నారు. సమావేశం పూర్తైయిన తరువాత 4గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది. ఈ ప్రెస్ మీట్ లో జాతీయ రాజకీయ పార్టీని ఎందుకు ఏర్పాటు చేశారు.. విధులేంటి, నిధులేంటి, ఏం చేయబోతున్నారనే విషయంపై క్లారిటీ ఇవ్వనున్నారు.
== ముఖ్యఅతిథులుగా కుమారస్వామి, తిరుమవలవన్
తెలంగాణ రాష్ట్రంలో జరిగే టీఆర్ఎస్ సర్వసభ్యసమావేశానికి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పార్టీల నాయకులు హాజరైయ్యారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు ఎంపీ.తిరుమవలవన్ ముఖ్యఅతిథులుగా హాజరైయ్యారు. తిరుమవలవన్ ముగ్గురు ఎంపీలతో, కీలక నాయకులతో ఈ సమావేశానికి హాజరైయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో వారి పార్టీని వీలనం చేయనున్నారు.