Telugu News

ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపికలో ట్విస్ట్..*

మహిళకు మొండి చేయ్యి..

0

*ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపికలో ట్విస్ట్..*

*మహిళకు మొండి చేయ్యి..*

(హైదరాబాద్-విజయం న్యూస్)

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే అనుకున్నారో వారిలో ఒక పేరును కొత్తగా చేర్చి అందరినీ విస్మయానికి గురి చేశారు. ఇప్పటి వరకు ఎమెల్సీగా పనిచేసిన ఆకుల లలిత కు సీఎం కేసీఆర్ మొండి చూపించినట్లు కనిపిస్తుంది. ఆమె ప్లేస్ లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బండ ప్రకాష్ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న గుత్తా సుఖేందర్ రెడ్డి తక్కెళ్లపల్లి రవీందర్ వారికి మరోసారి అవకాశం కల్పించగా ప్రస్తుతం హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కేటాయించడం జరిగింది. అలాగే మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయడం రాజకీయ కోణంలోనే కొత్త మలుపు అని చెప్పొచ్చు రాజ్యసభ సభ్యుడిగా పనిచేస్తున్న అతనికి ఎందుకు ఎమ్మెల్సీ కోటాలో టికెట్ కేటాయించాల్సి వచ్చింది అనేదానిమీద రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బండ ప్రకాష్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కేటాయించటం పట్ల పలువురు ఆసక్తిని కనబరుస్తున్నారు. అలాగే ఇటీవలే సిద్దిపేట జిల్లా కలెక్టర్ కు రాజీనామా చేసిన వెంకట రామి రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరారు చేరకముందే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం ఇది రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యపరిచిన అని చెప్పవచ్చు. మొత్తానికి ఎమ్మెల్యే కోటా లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరికొద్ది నిమిషాల్లోనే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. శాసనమండలి స్థానాలకు ఏకగ్రీవం అవకాశాలున్నాయి

Allso read:- రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం..