Telugu News

ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ కన్నెర్ర

గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో  నిరసన గళం

0

ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ కన్నెర్ర

✍️ సామాన్యుడి  కోసం టీఆర్ఎస్ పోరుబాట

✍️ గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో  నిరసన గళం

✍️ పెంచిన ధరలు వెనక్కి తీసుకోవాలి.

✍️ టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు,  లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ  నామ నాగేశ్వరరావు నేతృత్వంలో గాంధీ విగ్రహం వద్ద ఎంపీల ధర్నా

ఖమ్మంప్రతినిధి, జులై 20(విజయంన్యూస్)

సామాన్యుడి కోసం  టీఆర్ఎన్ పోరుబాట పట్టింది. వరుసగా  మూడు రోజులుగా పార్లమెంట్ ను కేంద్ర  బిందువుగా చేసుకొని, ప్రజలపై  కేంద్రం మోసిన భారాలను నిరసిస్తూ  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. | పెట్రో ధరలు, నిత్యావసర వస్తువుల  ధరలు, జీఎస్టీ  పెంచి సామాన్య  ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న కేంద్రంపై మూడో రోజు కూడా ఢిల్లీ కేంద్రంగా టీఆర్ఎస్ ఎంపీలు కన్నెర్ర చేశారు.

ఇది కూడా చదవండి :- భద్రాద్రిని కాపాడిందేవరు..?

సామాన్యులపై ధరల భారం,  ద్రవ్యోల్బణం, కొత్తగా ఆహార పదార్థాలపై జీఎస్టీ పెంపు , అగ్నిపద్, పెట్రో, ఆహార ఉత్పత్తులపై మోయలేని భారాలను ఎండగడుతూ బుధవారం కూడా పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద పార్టీ పార్లమెంటరీ నేత కేశవరావు,నామ నాగేశ్వరరావు నేతృత్వంలో పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి, నిరసన గళం వినిపించారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా వారికి మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా ఎంపి నామ మాట్లాడుతూ  ప్రజలపై మోపిన భారాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  సీఎం  కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో  దూసుకుపోతున్న తెలంగాణపై వివక్ష విడనాడి, రావాల్సిన  నిధులను వెంటనే వవిడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చ జరిపి,  ప్రజలను భారాల నుంచి అదుకోవాలని కోరారు. తొలుత సభ  ప్రారంభం కాగానే ఎంపీలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ  నిరసన గళమెత్తారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాల ప్లకార్డులను  ప్రదర్శించిన నిరసన తెలిపారు.మూడో రోజు కూడా టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ పార్లమెంట్లోని ఉభయ సభలను  స్తంభింప జేశాయి. గంగోళ పరిస్థితుల నడుమ స్పీకర్ సభను గురువారానికి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే. కేశవరావు,   ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, కె. ఆర్. సురేష్ రెడ్డి, మలోత్ కవిత, బోర్లకుంట వెంకటేష్ నేతకాని , పోతుగంటి రాములు, పూసునూరి దయాకర్, మన్నే శ్రీనివాస రెడ్డి, దివకొండ దామోదర రావు, గడ్డం రంజిత్ రెడ్డి, బండి పార్థసారధిరెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర,తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: వరద పరిస్థితి పై ఢిల్లీ నుంచి ఎంపీ నామ అరా