Telugu News

తీన్మార్ మల్లన్నపై ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఫిర్యాదు

** మంత్రి కేటీఆర్ కొడుకుపై అసభ్యపదజాలంతో విమ్మర్శచేయాడాన్ని ఖండించిన టీఆర్ఎస్

0

తీన్మార్ మల్లన్నపై ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఫిర్యాదు

** మంత్రి కేటీఆర్ కొడుకుపై అసభ్యపదజాలంతో విమ్మర్శచేయాడాన్ని ఖండించిన టీఆర్ఎస్
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పట్ల చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో విమర్శించడాన్ని టీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మీద, వారి కుమారుడు హిమాన్షు రావు మీద అసభ్య పదజాలం వాడుతూ రాజకీయాలకు సంబంధం లేని కుటుంబ సభ్యులను కించపరుస్తూ తెలంగాణ సమాజంలో విద్వేషాలు నింపుతున్న తీన్మార్ మల్లన్న మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఖమ్మం పట్టణంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో యువజన విభాగం నేతలు సి .ఐ. శ్రీధర్ కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న మీద కఠిన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా బిజెపి నాయకులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు.కృష్ణ చైతన్య తో పాటు నగర యువజన విభాగం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి మాటేటి. కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులు బలుసు. మురళీకృష్ణ ,సరిపుడి .గోపి సందేశ్, శీలం. శ్రీనివాస్, పవన్ ,ఉదయ్ ,రాంబాబు, ఫిరోజ్ ,షాకీర్ ,సతీష్, తదితరులు పాల్గొన్నారు.

 

also read :- జీళ్ళచెరువులో వైభవంగా కోలాటం

also read :-సెయింట్ జోసఫ్స్ కో- కెథడ్రల్ చర్చి గుట్టలబజార్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు .