Telugu News

అధర్మంపై సత్యమే గెలిచింది: సంభాని

హనుమాన్ టెంపుల్ లో పూజలు చేసిన మాజీ మంత్రి సంభాని

0

అధర్మంపై సత్యమే గెలిచింది: సంభాని

== కల్లూరులో కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

== హనుమాన్ టెంపుల్ లో పూజలు చేసిన మాజీ మంత్రి సంభాని

(కల్లూరు-విజయం న్యూస్)

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోరుతూ కల్లూరు పట్టణంలో కొలువై ఉన్న హనుమాన్ టెంపుల్ నందు ఆంజనేయ స్వామి వారికి *మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీ సంభాని చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.

ఇది కూడా చదవండి:- దళితులను ఇంకెంత కాలం మోసం చేస్తారు ?: సంభాని
అనంతరం కల్లూరు పట్టణంలో అంబేడ్కర్ విగ్రహంవద్ద కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాన్ని పురస్కరించుకొని బాణాసంచా కాల్చి, కార్యకర్తలు, ప్రజలకి మిఠాయిలు పంచి ఆనందంవ్యక్తం చేశారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన పురాణాలు రామాయణ, మహాభాగవత కాలం నుండి నేటి వరకు కూడా *అధర్మం మీద సత్యమే గెలిచింది* అని నేటి కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ద్వారా నిరూపితమైందని రానున్న రోజుల్లో మనదేశానికి, దేశప్రజల భవిష్యత్ కి ఇదిశుభసూచకమని తెలిపారు.

ఇది కూడా చదవండి:- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు పంటకు గిట్టుబాటు ధర: సంభాని
గత పది సంవత్సరాలుగా BJP ప్రభుత్వంలో ఈ దేశప్రజలు ఎన్నో అవస్థలు, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, దేశ సమగ్రతకు, దేశ రక్షణకు భంగం వాటిల్లిందని, ప్రమాదం వాటిల్లిందని, మత సామరస్యానికి తూట్లు పొడుస్తూ మతం ముసుగులో మతతత్వ రాజకీయాలు చేస్తూ దేశప్రజల మధ్య చిచ్చుపెట్టిందని తెలిపారు.
అలాగే దేశంలో అన్నదాతలను పట్టించుకోకుండా రైతు వ్యతిరేక చట్టాలు చేసి వారిని నట్టేట ముంచారు. కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారత కోసం చట్టసభల్లో రిజర్వేషన్లు తెస్తే BJP ప్రభుత్వం వాటిని అమలుచేయకపోవడం వలన మహిళలకి రక్షణ లేకుండా పోయి వారిపై ఆకృత్యాలు పెరిగాయని, ప్రభుత్వ రంగాలని ప్రయివేటు పరంచేసి దేశ ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని, ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని యువతని మోసం చేశారని దీనివలన నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు.

ఇది కూడా చదవండి:- ఔటర్‌ రింగ్‌రోడ్డులో భారీకుంభకోణం: రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత, భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు దేశ సమగ్రత, సమైక్యత కొరకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రకి అన్ని రాష్ట్రాల ప్రజలనుండి మంచి స్పందన వచ్చి ప్రజల్లో మార్పు వచ్చిందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ నూతనోత్సాహంతో సమిష్టిగా కృషి చేయాలని కోరుతూ రాహూల్ గాంధీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమని, సమిష్టిగా కలిసి ఎన్నికల్లో విజయం సాధించినందున కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, స్టేట్ Sc Dpt కన్వీనర్ కొండూరు కిరణ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, కత్తి మాధవరెడ్డి, ఆళ్ళ వేంకటేశ్వర రావు, చుక్కా, భాస్కర్ రావు, ఇజ్జగాని సత్యం, దారా రంగా, పోతురాజు నరేంద్ర, మేకల ప్రసాద్, సమీర్ ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.