తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులు వీరే
== కొందరు ఆశావాహులకు చెక్
== ఖమ్మం జిల్లా నుంచి ఆ ఇద్దరికి నో చాన్స్
== ముందే చెప్పిన విజయం పత్రిక
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ్య రాజ్యసభ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇద్దరు ఓసీ,ఒక బీసీ అభ్యర్థులను ప్రకటించారు. ఎవరు ఊహించని పేర్ల తెరమీదకు రాగా, ఊహించిన నేతలకు మాత్రం షాక్ తగిలినట్లైంది.. దీంతో సీఎం కేసీఆర్ తన రాజకీయ మార్కును మరోసారి నిరూపించుకున్నట్లైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇటీవలే రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో త్వరలోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండగా రాజ్యసభ సభ్యుడిగా ఎవరు ఉంటారనే విషయంపై అనేక ఊహాగానాలు, అనేక మంది ఆశావాహులు.. ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి.. ఇదిగో ఇతనికి వస్తుందటే..లేదులేదు అతనికే వస్తుందని ప్రకటనలు వచ్చిన పరిస్థితి ఉంది. కానీ అన్నింటికి సీఎం కేసీఆర్ పుల్ స్టాఫ్ పెడుతూ ఎవరు ఊహించని నాయకులకు రాజ్యసభ పేర్లను ఖరారు చేశారు. తనకు నమ్మిన బంటువుగా ఉంటున్న నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్ రావును రాజ్యసభ కు ఎంపిక చేశారు. అలాగే హెటిరో అధినేత డాక్టర్ బండి పార్థసారథిరెడ్డిని ఎంపిక చేశారు. అలాగే మొదటి నుంచి ఖమ్మం జిల్లాకు రాజ్యసభ స్థానం వస్తుందని ఊహించినట్లుగానే ఆ ఇద్దరు నేతలకు కాకుండా ఖమ్మం జిల్లాకు ప్రీయార్టిని ఇస్తూనే గాయత్రి రవికి అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటి వరకు రాజ్యసభ స్థానం కోసం టిక్కెట్ ను ఆశించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అవకాశం దక్కలేదు.ఆ ఇద్దరికి రాజ్యసభ స్థానం దక్కకపోవచ్చనే విషయాన్ని విజయం తెలుగు దినపత్రిక ముందే చెప్పింది.. ఇద్దరిలో ఏ ఒక్క నేతకు రాజ్యసభ స్థానం కల్పించిన తప్పకుండా జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఇద్దరికి రాకపోవచ్చని విజయం పత్రిక ముందుగానే చెప్పింది. అయితే రాజ్యసభ స్థానం వద్దని, ఎంపీగానే అవకాశం కల్పించాలని పొంగులేటి చెప్పినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. రాజ్యసభ ఈ సారి గాయత్రి రవికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది, తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పే ప్రయత్నంలో మంత్రి కేటీఆర్ పొంగులేటితో బేటి అయినట్లు సమాచారం.
== బండి ప్రకాష్ రాజీనామాతో గాయత్రి రవికి అవకాశం
రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండిప్రకాస్ ఇటీవలే ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించడంతో ఆ స్థానానికి బండి ప్రకాష్ రాజీనామా చేశారు. ఇంకా రెండేళ్ల సమయం ఉండటంతో తప్పని పరిస్థితుల్లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పదవి కోసం చాలా మంది ఆశించినప్పటికి సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు కేటాయించాలని భావించారు. అయితే రెండేళ్ల పదవి కోసం మొదటిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేయాలని భావించినప్పటికి ఆయన రెండేళ్ల పదవిని కోరుకోలేదు. దీంతో ఖమ్మం జిల్లాలో రాజకీయం చేసిన మహుబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన గాయత్రిరవిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. దీంతో గాయత్రి రవి మరో రెండేళ్ల పాటు మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.
ఖమ్మం జిల్లాకు ఇద్దరికి అవకాశం
రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో సీఎం కేసీఆర్ ఇద్దరికి అవకాశం ఇచ్చినట్లైంది. మహుబూబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన గాయత్రి రవి మొదటి నుంచి ఖమ్మం జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ, మహుబూబాద్ జిల్లాలో ఎప్పుడు రాజకీయం చేయలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లా నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఆ తరువాత కూడా వరంగల్ జిల్లాలో ప్రాతినిథ్యం వహించిన దాఖలాలు లేవు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన గాయత్రి రవి ఖమ్మం జిల్లాలోనే రాజకీయాలు చేశారు. గత ఎమ్మెల్సీ స్థానానికి ట్రై చేసిన ఆయన తాతామదు ఎంపికతో తప్పని పరిస్థితిల్లో ఆగిపోయాడు. ఆ తరువాత ఆయన ఒపిక రాజకీయానికి తగిన గౌరవం దక్కినట్లైంది. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మం జిల్లాకు చెందిన హిటిరో డ్రగ్స్ అదినేత డాక్టర్ పార్థసారథిరెడ్డికి రాజ్యసభ కు అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లాలో కొన్నాళ్లు పాటు డాక్టర్ గా పనిచేసిన పార్థసారథిరెడ్డి, ఆ తరువాత హైదరాబాద్ కే పరిమితమైయ్యారు. దీంతో ఖమ్మం జిల్లాకు రెండు స్థానాలు దక్కినట్లైంది.