Telugu News

 టిఎస్ ఆర్ టి సి కార్గో కు రెండేళ్ళు పూర్తి

వరంగల్ & ఖమ్మం జిల్లాల కార్గో  మేనేజర్ శ్రీనివాస్..

0
 టి ఎస్ ఆర్ టి సి కార్గో కు రెండేళ్ళు పూర్తి
 == ఖమ్మం రీజన్ ఆదాయం  6•53 కోట్లు..
 == వరంగల్ & ఖమ్మం జిల్లాల కార్గో  మేనేజర్ శ్రీనివాస్..
మణుగూరు, జూన్18 (విజయం న్యూస్)
 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్గో పార్సెల్ సర్వీస్ సేవలు జూన్ 19 నాటికి రెండు సంవత్సరాలు పూర్తి  అయిన సందర్భంగా వరంగల్ & ఖమ్మం జిల్లాల కార్గో  మేనేజర్ శ్రీనివాస్ కార్గో ఆదాయ వివరాలను శనివారం వెల్లడించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్గో ప్రారంభించిన మొదటి సంవత్సరం పోలిస్తే రెండవ సంవత్సరం మరింత మెరుగ్గా సర్వీస్  అందించి కస్టమర్ల అభిమానం  చూరగొన్న మన్నారు.  కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సేవలు అందించేందుకు సంస్థ అనేక రకాలుగా ఆలోచించి మెరుగైన సేవలు కోసం ప్రయత్నిస్తున్నమన్నారు. గత ఏడాది  వివిధ జిల్లాల లో బుక్ చేసిన పార్సిల్స్ ను జంటనగరాల్లోని ఎంజీబీఎస్ జేబీఎస్ లో మాత్రమే  పార్సిల్ తీసుకునే అవకాశం  మాత్రమే ఉందని అన్నారు దీనితో కస్టమర్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో 25 కార్గో పాయింట్లను గుర్తించి వాటి ద్వారా డెలివరీ చేయడానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
అదేవిధంగా జంటనగరాల్లో 11 ప్రాంతాలను గుర్తించి హోమ్ డెలివరీ సైతం చేయడం జరుగుతుందని ఈ సేవలను జంటనగరాల్లో పూర్తిగా విస్తరించేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.  కార్గో పార్సెల్ బుక్ చేసుకున్న 24 గంటల లోపు హోం డెలివరీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు . కార్గో పార్సెల్  సర్వీస్ తో పాటు  మేడారం సమ్మక్క సారక్క జాతర  కు  వెళ్ళలేని భక్తుల కోరిక మేరకు వారి యొక్క బంగారమును కార్గో

ద్వారా అమ్మవారి చెంత కు తరలించి తిరిగి ప్రసాదమును కస్టమర్లకు అప్పగించటం, శ్రీరామనవమి సందర్భంగా నవమికి వెళ్ళలేని భక్తులు  కార్గో లో బుక్ చేసుకున్న వారికి తలంబ్రాలను భక్తులకు చేరవేయడం జగిత్యాల నుండి  సహజసిద్ధంగా పండించిన మామిడి పండ్లను బుక్ చేసుకున్న కస్టమర్లకుమామిడి పండ్లను  కస్టమర్లకు అందించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందన్నారు.  అదేవిధంగా బల్క్ గా బుక్ చేసుకున్న వారికి కార్గో వాహనాల ద్వారా రవాణా చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో కార్గో వాహనాల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం విజయ ఆయిల్  ప్రభుత్వ పాఠ్య పుస్తకాల సరఫరా పది ఇంటర్ తరగతుల ఆన్సర్ సీట్ల రవాణా తదితర బల్క్ బుకింగ్ తో పాటు ప్రైవేటు పరిశ్రమల నుంచి వస్తువుల రవాణా ఇల్లు  షిఫ్టింగ్ లాంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు .కార్గో సర్వీసును తెలంగాణ లో ప్రతి ప్రాంతానికి విస్తరించడం తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాలకు కర్ణాటక బెంగళూరు మహారాష్ట్ర ప్రాంతాలకు సైతం సేవలు విస్తరించడం జరిగిందన్నారు.  రాష్ట్రంలో మొదటి పాయింట్ నుంచి చివరి పాయింట్ వరకు కార్గో అందరికీ  అందుబాటులో ఉండే విధంగా విస్తరించేందుకు చర్యలు చేపడతామన్నారు.