Telugu News

తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్‌ సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ ఇందులో పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు.

0

హైదరాబాద్‌:-  తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై మంత్రి పువ్వాడ అజయ్‌ సమీక్ష నిర్వహించారు.

ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌ ఇందులో పాల్గొన్నారు.

ఛార్జీల పెంపుపై అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు.

పల్లె వెలుగుకు కి.మీ.కు 25పైసలు.. ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. సిటీ ఆర్డినరీ సర్వీసులకు కి.మీ.కు 25పైసలు, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఆపై సర్వీసులకు కి.మీ.కు 30పైసలు పెంచాలని ప్రతిపాదించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ పరిశీలన తర్వాతే ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు.