నిరుద్యోగులకు టి.ఎస్.ఆర్టీసీ గుడ్ న్యూస్..
▪️సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌లపై 20శాతం తగ్గింపు.
నిరుద్యోగులకు టి.ఎస్.ఆర్టీసీ గుడ్ న్యూస్..
▪️సిటీ ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్‌పాస్‌లపై 20శాతం తగ్గింపు.
▪️పోటీ పరీక్ష అభ్యర్థులకు ఎంతో ప్రయోజనం.
▪️తక్షణమే అమల్లోకి తేవాలని అధికారులుకు మంత్రి పువ్వాడ ఆదేశం
(ఖమ్మం విజయం న్యూస్):-
ప్రజా రవాణా వ్యవస్థలో అతి పెద్ద సంస్థగా పేరుగాంచిన టి.ఎస్.ఆర్.టి.సి సామాజిక సేవలోనూ తనవంతు పాత్ర పోషిస్తోంది.సంస్థ అభ్యున్నతి దిశగా ఆలోచిస్తూనే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటోంది.ఇటీవల కాలంలో ప్రజల నాలుకల్లో నానుతూ వస్తున్న సంస్థ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధ్వర్యంలో మరో మారు కీలక నిర్ణయంతో ముందుకొచ్చింది.నిరుద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే వివిధ ప్రభుత్వ శాఖలలో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అందులో భాగంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగుల కోసం ఓ చక్కటి శుభవార్తను అందించింది.
also read :-ఖబర్దార్ గల్లా.. తప్పుడు ఆరోపణలు మానుకో
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ యువతకు రాష్ట్ర వ్యాప్తంగా 20శాతం రాయితీని కల్పిస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ప్రకటించి ప్రజలకు మరింత చేరువైన సంస్థ మంత్రి పువ్వాడ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా టి.ఎస్.ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ వి.సి అండ్ ఎం.డి శ్రీ వి.సి.సజ్జనార్ మాట్లాడుత.. పేద అభ్యర్థులకు చేయూతను అందించాలనే ఉద్ధేశంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంచి ఆలోచన చేశారని వివరించారు.
also read :-సర్పంచ్ కుటుంబానికి పొంగులేటి పరామర్శ
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్‌లపై మూడు నెలలకు 20 శాతం రాయితీ ఇవ్వడం జరుగుతోందని వెల్లడించారు.ఈ ప్రత్యేక ఆఫర్ మూడు నెలల పాటు అందించనున్నట్లు చెబుతూ, బస్ పాస్ పొందడానికి దరఖాస్తుకు సంతకం చేసిన ఆధార్ కార్డుతో పాటుగా కోచింగ్ సెంటర్ ఐడీ కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన నిరుద్యోగ గుర్తింపు కార్డు జత చేయాల్సి ఉంటుందని వివరించారు.సిటీ ఆర్డినరీ రూ.3450, ఎక్స్‌ప్రెస్ రూ.3900 ఉండగా పోటీ అభ్యర్థులకు 20 శాతం రాయితీ కల్పించిన తరువాత వరుసగా రూ.2800, రూ.3200 ఛార్జీలు ఉంటాయిని తెలిపారు.ఈ రాయితీ మొదటి సందర్భంలో 6 నెలల పాటు కొనసాగుతుందని, శిక్షణ / కోచింగ్ తరగతులకు హాజరవుతున్న నిరుద్యోగులకు ఇది ఎంతో ప్రయోజనం అని పేర్కొన్నారు.అన్ని బస్ పాస్ కౌంటర్లలలోనూ నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని తెలిపారు.