Telugu News

పాలేరుకు ‘తుమ్మల’.. ఖమ్మంకు ‘పొంగులేటి’..?

పినపాకకు ‘పోడెం’..?

0

పాలేరుకు ‘తుమ్మల’.. ఖమ్మంకు ‘పొంగులేటి’..?

== పినపాకకు ‘పోడెం’..?

== కొత్తగూడెంకు కూనంనేని

== ఖారారైన సీట్ల సర్దుబాటు..?

== ఖమ్మంలో అసక్తికరంగా మారుతున్న రాజకీయాలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల ప్రకటన మాత్రం అశావాహులను కలవర పెడుతుందనే చెప్పాలి.. నువ్వా..నేనా అన్నట్లుగా సాగుతున్న అభ్యర్థలు ఎంపిక ప్రక్రీయలో రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయ విశ్లేషకులకే అందనంత విధంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన పరిస్థితి ఉంటే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరో రకంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.. గత కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ పార్టే లేదనుకున్న ప్రజలకు, తుమ్మల, పొంగులేటి చేరికతో బలపడిగా,  ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి  కమ్యూనిస్టుల అండ దొరకడంతో రాజకీయ సమీకరణాల్లో పెనుమార్పులు ఏర్పడ్డాయి..

ఇది కూడా చదవండి: కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి

అంటే మాములు మార్పులు కాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యేను సైతం మార్చే రసవత్తర రాజకీయమార్పులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.. జనబలం కల్గిన నేతల చేరికతో బలపడిన కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల కలియకతో మరింత బలపడిందనే చెప్పాలి.. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో పార్టీ అధిష్టానానికి తలకుమించిన భారంగా మారింది.. అయినప్పటికి చాలా నేర్పుగా, ఓర్పుగా సీట్లను సర్దుబాటు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అత్యంత తెలివిగా రాజకీయాలను మలుపుతిప్పుతుందనడంలో సందేహమే లేదు.

== ఖమ్మంకు పొంగులేటి..పాలేరు తుమ్మల

ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు  టిక్కెట్ల కేటాయింపు విషయంలో గందరగోళం ఏర్పడింది.  కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో పాలేరు నియోజకవర్గానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , ఖమ్మం నియోజకవర్గానికి తుమ్మల నాగేశ్వరరావు అయితే కచ్చితంగా రెండు సీట్లు గెలుస్తారని రిపోర్ట్ రావడంతో అదిష్టానం ఆ విధంగా సీట్లను సర్ధుబాటు చేయాలని భావించింది. పొంగులేటి మాత్రం కొత్తగూడెంలో పోటీ చేసేందుకు అసక్తి చూపించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

కానీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గంపై పట్టువీడకపోవడం, కొత్తగూడెం నియోజకవర్గానికి సీపీఐకి కేటాయించడంతో తప్పని పరిస్థితుల్లో సర్దుబాటు చేయాల్సి వచ్చింది.. దీంతో పాలేరు నియోజవర్గానికి తుమ్మల నాగేశ్వరరావుకు, ఖమ్మం నియోజకవర్గానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, కొత్తగూడెం నియోజకవర్గాన్ని కూనంనేని సాంబశివరావుకు కేటాయించడం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.. దాదాపుగా ఈ సీట్లు కేటాయింపు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

== పోడెం వీరయ్యకు షాక్..?

భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్యకు కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ భద్రాచలం స్థానాన్ని సీపీఎం కు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానమైన భద్రాచలంను సీపీఎంకు వదిలేయాల్సి వస్తుంది. కాగా భద్రాచలం ఎమ్మెల్యే మరో నియోజకవర్గానికి బదిలీ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా పేరోందిన పినపాక నియోజకవర్గంలో పోడెం వీరయ్యను పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ మేరకు వీరయ్యకు సాంకేతాలు ఇచ్చినట్లుగా సమాచారం. అయితే పోడెం వీరయ్య ఈ విషయంపై కొంత అసహానం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సర్ది చెప్పి ఒప్పించినట్లు తెలుస్తోంది. దీంతో పోడెం వీరయ్య ఇక పినపాక నుంచి పోటీ చేయాల్సి రావడం అనివార్యమేనా..?

== పాయం వెంకన్నకు ట్రబుల్ షాక్

కాంగ్రెస్ పార్టీలో సీటు దక్కే వరకు..బీఫామ్ వచ్చే వరకు అభ్యర్థి ఎవరనేది ప్రకటించడం కష్టతరమైన విషయమే.. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన పాయం వెంకటేశ్వర్లకు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షాక్ ఇచ్చినట్లుగానే తెలుస్తోంది. సీపీఐ పార్టీ వీడి వైసీపీ పార్టీలో చేరిన పాయం వెంకటేశ్వర్లు ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తిరిగి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పినపాక నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని కోరుకుంటున్న పాయం వెంకటేశ్వర్లకు ఆ టిక్కెట్ దాదాపుగా ఖారారైనట్లుగా ప్రచారం జరిగింది.

ఇది కూడా చదవండి: ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రోజునే పాయంకు కాంగ్రెస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. కమ్యూనిస్టులకు భద్రాచలం టిక్కెట్ కేటాయించడంతో భద్రాచలం ఎమ్మెల్యేను పినపాకకు పంపించేందుకు కాంగ్రెస్ యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఇప్పటి వరకు పినపాకను నమ్ముకుని ప్రచారం చేసిన పాయం వెంకటేశ్వర్లను ఎక్కడ భర్తి చేస్తారనే విషయంపై కన్ఫ్యూజన్ గా ఉంది. పాయం వెంకటేశ్వర్లకు టిక్కెట్ ఇస్తారా..? లేదా..? ఇవ్వాలనుకుంటే ఎక్కడ ఏర్పాటు చేస్తారనే విషయంపై కొంత గందరగోళాన్ని తలపిస్తోంది. చాలా ఉత్కంఠగా మారిన సీట్ల సర్థుబాటు యమయమీలను సైతం మార్చేయలగదని మరోసారి నిరూపించింది. మొత్తానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీట్ల సర్ధుబాటు కాంగ్రెస్ అదిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకేన్ని షాక్ లు ఇవ్వబోతుందో  చూడాల్సిందే..?