కాంగ్రెస్ గూటికి తుమ్మల..?
== పాలేరు నుంచి పోటీ..
== తుమ్మలకు పోన్ చేసిన కాంగ్రెస్ కీలక..?
== కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించిన జాతీయ నేత
== సెప్టెంబర్ 4న ఢిల్లీకి పయనం..?
== కాంగ్రెస్ లో చేరాలని కార్యకర్తల తీవ్ర ఒత్తిడి
== మానసికంగా సిద్దమైన అనుచరులు
== స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసిపోతున్న కార్యకర్తలు
== బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యం
== మారుతున్న రాజకీయ సమీకరణాలు
(కూసుమంచి-విజయంన్యూస్)
బీఆర్ఎస్ పార్టీ తప్పిదం చేసిందా..? జనబలం కల్గిన నాయకుడికి టిక్కెట్ ఇవ్వకపోవడం వల్ల ఆ పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందా..? ఒక్క నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభావం పడే అవకాశం ఉందా..? బీఆర్ఎస్ కు రిటన్ గిప్ట్ ఇచ్చే పనిలో పడ్డారా..? అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దమైందా..? తుమ్మలకు కాంగ్రెస్ ఆగ్రనేత నుంచి పోన్ వచ్చిందా..? ఢిల్లీకి పయనమవుతున్నాడా..?
Allso read-నేడు ఖమ్మానికి అమిత్ షా..
అంటే అవుననే సమాధానం వస్తుందో..? నిజమేనంటూ ఆయన అనుచరులు అంగీకరిస్తున్నారు.. రాజకీయ విశ్లేషకులు తెల్చిపడేస్తున్నారు.. కచ్చితంగా కాంగ్రెస్ లో చేరుతున్నాడంటూ కుండబద్దలు కొడుతున్నారు.. బీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని తెల్చి చెబుతున్నారు.. కాంగ్రెస్ కు ఖమ్మంలో పది స్థానాలు ఖాయమంటూ జోస్యం చెప్పుబుతున్నారు.. అవమానించిన చోటే అద్భుతం స్రుష్టిస్తామని చెబుతున్నారు. దీంతో ఖమ్మం జిల్లా రాజకీయం మరింతగా హీటేక్కినట్లైంది.. అయితే తుమ్మల నాగేశ్వరరావు మాత్రేం ఈ విషయంపై స్పష్టతనివ్వడం లేదు.. పోటీ చేయడం ఖాయమని అంటున్నప్పటికి ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వకోవడంతో కొంత ఉత్కంఠ నేలకొంది.. మరోవైపు బీజేపీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు మా పార్టీలోనే చేరే అవకాశం ఉందని చెప్పడంతో తుమ్మల రాజకీయ భవిష్యత్ పై ప్రశ్నలు మొదలైయ్యాయి. అయితే అసలు ఖమ్మం జిల్లాలో ఏం జరుగబోతుంది..? రాజకీయం ఎటువైపు తిరుగుతోంది..? తుమ్మల ఏ పార్టీలో చేరతారు..? కాంగ్రెస్ గూటికి చేరినట్లేనా..?
Allso raed-జలగం దారేటు..?
అందంతా తెలుసుకోవాలంటే మరింత సమాచారం ఖమ్మంప్రతినిధి అందించే రాజకీయ విశ్లేషణాత్మక కథనం చదవాల్సిందే..?
ఖమ్మం జిల్లా అభివృద్ది ప్రధాత గా పేరుగాంచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్ల బీఆర్ఎస్ పార్టీ ఊహించని తప్పిదం చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు అభిమాన నాయకుడైన తుమ్మల నాగేశ్వరరావు పట్ల రాజకీయ చాణిక్యుడు సీఎం కేసీఆర్ తప్పటడుగు వేశారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.. జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా ఉంటూ సీనియర్ రాజకీయ నేతగా సుదీర్ఘకాలం మంత్రిగా చేసి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన తుమ్మల మాట పట్టించుకోకపోవడం, చిన్నచూపు చూడటంతో రాజకీయ అజ్జానితత్వమేనంటున్నారు కొందరు రాజకీయ పండితులు.. జిల్లా ఏకచత్రాధిపత్యంగా నడిపించగల నాయకుడ్ని దూరం చేసుకోవడం, ఆయన పట్ల విశ్వాసాన్ని కోల్పోవడం పార్టీ తప్పిదం చేసిందంటున్నారు.. అయితే రాజకీయంగా హాట్ అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కసారిగా తన నలుపది దశాబ్ధాల రాజకీయ చతురితను బయటపెట్టిన పరిస్థితి మనమంతా చూశాం.
Allso read- ఖమ్మం పొలిటికల్ లో విచిత్రం..?
టిక్కెట్ రాకపోవడంతో ఆగ్రహించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసహానంతో ఊగిపోతూ తన ప్రతిభను చాటుకున్న పరిస్థితి నాయకన్ గూడెంలోని జిల్లా సరిహద్దులో చూశాం. ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో జనం ఆయనకు స్వాగతం పలికేందుకు రావడం, మండుటెండను సైతం లెక్కచేయకుండా గంటల తరబడి రోడ్లపై విక్షణ చేయడం పట్ల ఆయన జిల్లా ప్రజల మనసులను ఎంతగా గెలుచుకున్నారో మనకు అర్థమవుతోంది.
== సత్తా చూపిన తుమ్మల
శుక్రవారం వేలాదిమంది అభిమానుల మధ్య ఆయన ఖమ్మం సరిహద్దుల్లోకి ప్రవేశించారు …ఒక్కసారిగా తుమ్మల రాకతో జనం కేరింతలు కొట్టారు …జై తుమ్మల అంటూ నినదించారు …వేలాది వాహనాలు వెంట రాగా అడుగడుగునా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు …
Allso read-మట్టాదయానంద్ కు బిగ్ షాక్
తుమ్మల అభిమానుల సత్తా అంటే ఏమిటో చూపించారు …తుమ్మలను విస్మరిస్తే జరిగే పరిణామాలు ఇలా ఉంటాయనే హెచ్చరికను పంపించారు. తుమ్మల లాంటి సీనియర్ నేత ఉంటె తమపప్పులు ఉడకవని కొందరి భావన అయి ఉండవచ్చు. ఒకప్పుడు కావాలని తుమ్మలను పార్టీలోకి ఆహ్వానించి ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చిన కేసీఆర్ కు తుమ్మల ఇప్పుడు ఎందుకు చెడ్డవారైయ్యారనేది బ్రహ్మరహస్యం … వీరికి ఎక్కడ చెడింది అనేది పరిశీలిస్తే రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో కొన్ని చర్చనీయాంశం కాగా … మరికొన్ని లేనివి …
== ఓడిపోయిన కుంగిపోని నేతగా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కల్గిన తుమ్మల నాగేశ్వరరావుకు అనేక ఆటుపోట్లు వచ్చాయి. మొదటి సారి ఒటమితో తన రాజకీయ పయనం ప్రారంభించిన తుమ్మల నాగేశ్వరరావు ఆ తరువాత ఎన్నో ఓటమిలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సత్తుపల్లి నుంచి ఒకసారి ఓడి, మరోసారి గెలిసి, ఆ తరువాత ఓడి, మళ్లీ ఖమ్మంలో గెలిచి, తిరిగి ఓడిపోయి, మళ్లీ పాలేరులో గెలిచి, తిరిగి ఓడిపోయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు.
Allso read-:- గులాబీ నేత కుటిలత్వం
అయితే గెలిచిన, ఓడిపోయిన అతను ఓకేలా ఉండేవారు. జిల్లా ప్రజల సంక్షేమం, జిల్లా అభివద్ది ఆయన అంతిమ లక్ష్యంగా ఉండేది. ప్రభుత్వం వచ్చిన, రాకపోయే ఆయన అనుకున్నది సాధించేవారు. ప్రభుత్వాలపై పెత్తనం చేలాయించేవారు. అనుకున్నదల్లా సాధించి జిల్లా ప్రజలకు అందించారు. అందులో అనేక పథకాలు ఉన్నాయి. 60ఏళ్లకాలం పాటు జిల్లాకు అతి దగ్గరలో.. అభివృద్దికి అమడదూరంలో ఉన్న పాలేరు నియోజకవర్గాన్ని మూడు నెలల్లోనే 30ఏళ్లలో చేసిన అభివృద్ది చేశారు. అందుకే ఆయన వేలాధి మంది ప్రజల మనుసును గెలుసుకున్నారు. ఖమ్మంజిల్లాను తాను ఎంతో కష్టపడి నిర్మించుకున్నారు. అలాంటి సౌధాన్ని కూల్చేపని చేసి తుమ్మల ఇమేజిని ఒక్కసారిగా దెబ్బతీసే ప్రయత్నం జరిగింది. కానీ జిల్లాలో ఆయన చేసిన అభివృద్ధి, ముందు చూపు వల్ల ఆయన్ను డ్యామేజీ చేయలేక పోయారు … ఓడిపోయిన కుంగిపోకుండా నిత్యం ప్రజల్లో ఉన్నారు …దీంతో ఆయనపట్ల సానుభూతి పెరిగింది…తుమ్మలకు జరిగిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు ..తిరగబడుతున్నారు …బీఆర్ యస్ , కేసీఆర్ పై ఆగ్రహం ప్రకటిస్తున్నారు ….ఆయన సేవలు ఉపయోగించుకోవడంలో కేసీఆర్ వైఫల్యం చెందారని అంటున్నారు . తుమ్మల ప్రభావం ఒక్క పాలేరుకో,లేక ఖమ్మంనికో పరిమితం కాదు …ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉంటుంది… ఇప్పటికే పొంగులేటి బీఆర్ యస్ ను వీడి పోవడం మైనస్ కాగా తుమ్మల ప్రభావం పారింతగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు …
== కాంగ్రెస్ వైపు తుమ్మల..?
ఆయన ఏపార్టీలోకి వెళ్తారనేది నేడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది . ఆయనకు ఉన్నది రెండు మార్గాలు ఒకటి బీజేపీలో చేరడమా…? రెండు కాంగ్రెస్ లోకి వెళ్లడమా..?అనేది … ఆయన అనుయాయిలు మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్లాలని వత్తిడి తెస్తున్నారు ..కచ్చితంగా పాలేరు నుంచి పోటీచేసి సత్తా చాటాలని అంటున్నారు … ఆయనకూడా నామదిలో అనేక విషయాలు ఉన్నప్పటికీ , ప్రజల అభిమానం ప్రేమ చూసిన తర్వాత కచ్చితంగా పోటీచేస్తా …అదికూడా పాలేరు నుంచే చేస్తానని కుండబద్దలు కొట్టారు… గోదావరి నీళ్లతో ఖమ్మం జిల్లా ప్రజల కాళ్లు కడుగుతా అని ప్రజల హర్షద్వానాలమధ్య ప్రకటించారు . తన జీవిత ఆశయం అదొక్కటే అన్నారు … ఇక ఆయన పోటీచేసే విషయంలో శషభిషలు లేవు …పాలేరు బరిలో పోటీ ఖాయమైంది…తనకు పాలేరు ప్రజల మీద విశ్వాసం ఉందని అందువల్ల వారి తీర్పు కోసం మళ్ళీ వెళతానని అంటున్నారు ..ఉమ్మడి రాష్ట్రంలో బలమైన సామాజికవర్గానికి చెందిన తుమ్మలకు టికెట్ నిరాకరించడంపై ఆ వర్గం కూడా అసంతృప్తిగా ఉంది . ఆ సామాజికవర్గంలో ఆయన పెద్దకాపు లాంటివాడు తుమ్మల మాట అంటే ఒక విలువ ఉంటుంది…అలాంటి నేతను విస్మరించడమంటే ఆవర్గం వారిని దూరం చేసుకోవడమేననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి …ఇప్పటివరకు కాస్తో కూస్తో కేసీఆర్ పై సానుకూలంగా ఉన్న ఆవర్గంలో సంతృప్తి లేదు …పైగా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు …బీఆర్ యస్ కు రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఇది కూడా ఒక కారణం అవుతుందనడంలో సందేహంలేదు….