Telugu News

గాయాలు పాలైన జర్నలిస్టుకు టియుడబ్ల్యూజె  స్నేహ హస్తం

ఐదు అంతస్తుల భవనం నుంచి  బాధితున్ని మోసుకు వచ్చిన జర్నలిస్టులు

0

గాయాలు పాలైన జర్నలిస్టుకు టియుడబ్ల్యూజె  స్నేహ హస్తం

== ఐదు అంతస్తుల భవనం నుంచి  బాధితున్ని మోసుకు వచ్చిన జర్నలిస్టులు

== ఆకుతోట ఆదినారాయణ బృందానికి ధన్యవాదాలు తెలిపిన బాధితుడి కుటుంబ సభ్యులు

ఖమ్మం జనవరి 4(విజయంన్యూస్):

 ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై,  తీవ్ర గాయాలు పాలైన రఘునాథపాలెం మండల వార్త విలేకరి పాశం వెంకటేశ్వర్లు కు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి.జె.ఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సారాధ్యంలోని జర్నలిస్టుల బృందం మరో మారు స్నేహస్తం అందించారు. ఖమ్మంలోని చైతన్య నగర్ లో నివాసం ఉంటున్న ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ నుంచి బాధితున్ని భుజాలపై స్ట్రక్చర్ సహాయంతో మోస్తూ కిందకు దించి అనంతరం శ్రీ రక్ష ఆసుపత్రికి బుధవారం తరలించారు.బాధితునికి ఆసరాగా ఎవరు లేకపోవడంతో  ఆకుతోట ఆదినారాయణ తన యూనియన్ సభ్యులను అప్రమత్తం చేసి తోటి జర్నలిస్టు పాశం వెంకటేశ్వర్లకు అండగా నిలిచారు. వారం క్రితం ఇందిరానగర్ చర్చి వద్ద నుంచి స్కూటీపై ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి గుర్తుతెలియని ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టడంతో తొంటి వద్ద పాశం వెంకటేశ్వర్లకు ఎముక విరిగింది.

ఇది కూడ చదవండి: కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే ఐజేయు నాయకులు

వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ పూర్తి చేశారు. దాదాపు 45 రోజులు పాటు ఎటు కదలకుండా ఉండాలని, ఏదైనా తేడా వస్తే ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు వెల్లడించిన విషయం తెలిసిందేకాగా ఆపరేషన్ అనంతరం బాధితున్ని తన ఇంటికి చేర్చే క్రమంలో ఐదు అంతస్తుల భవనం పైకి భుజాలపై మోసుకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు వారం తర్వాత  బాధితున్ని తను నివాసం ఉంటున్న ఐదు అంతస్తుల భవనం పై నుంచి  భుజాలపై మోస్తూ మరో మరో కిందకు దింపి ఎటువంటి ఆటంకం లేకుండా ఆస్పత్రికి చేర్చి అక్కడ వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం తిరిగి బాధితున్ని   ఐదు అంతస్తుల అపార్ట్మెంట్ పైకి తీసుకువెళ్లి మానవతాన్ని చాటుకున్నారు. ఇదే తరహా లోనే వైద్య పరీక్షలకు రావాలని డాక్టర్లు సూచించారు.బాధితుడు క్షేమంగా కోలుకునే వరకు అండగా ఉంటామని ఆకుతోట ఆదినారాయణ  భరోసా ఇవ్వడంతో బాధితుడి కుటుంబ సభ్యులు అందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఉపాధ్యక్షులు టిఎస్ చక్రవర్తి, సహకార దర్శి ఎస్ కే జానీ పాషా, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి కొరకొప్పల రాంబాబు, సహాయ కార్యదర్శి బిక్కి గోపి, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, నగర అధ్యక్ష కార్యదర్శులు బాలభత్తుల రాఘవ, అమరవరపు కోటేశ్వరరావు, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు యలమందల జగదీష్, నాయకులు శ్రీధర్, రామకృష్ణ, పి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి